పంజాబ్ లోనూ ఢిల్లీ గేమ్ మొదలుపెట్టేసిన బీజేపీ-టార్గెట్ చండీఘడ్-ఆప్ కు పెను సవాల్

ప్రత్యర్ధి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సాయంతో కేంద్రం ఆడుతున్న రాజకీయ క్రీడ ఇప్పుడు పంజాబ్ లోని చండీఘడ్ కు చేరింది. గతంలో ఢిల్లీ, పుదుచ్చేరి వంటి చోట్ల లెఫ్టినెంట్ గవర్నర్ల సాయంతో అక్కడి రాజకీయాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు చండీఘడ్ లోనూ అవే ఎత్తులు వేస్తోంది. దీంతో తాజాగా పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన భగవంత్ మాన్ సర్కార్ కు పెను సవాళ్లు తప్పేలా లేవు.

 కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ క్రీడలు

కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ క్రీడలు

దేశంలో తమ ప్రత్యర్ధులు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వారిని టార్గెట్ చేస్తూ రాజకీయ క్రీడలకు బీజేపీ తెరలేపుతోంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రాల్లో ప్రత్యర్ధి పార్టీలు అధికారంలో ఉంటే గవర్నర్ల ద్వారా వారిని టార్గెట్ చేయిస్తున్న బీజేపీ... అదే కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే లెఫ్టినెంట్ గవర్నర్ల సాయంతో రెచ్చిపోతోంది. దీంతో ప్రత్యర్ధి పార్టీలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఢిల్లీ, పుదుచ్చేరిలో గతంలో బీజేపీ ఆడిన రాజకీయ క్రీడల్ని మరిపిస్తూ ఇప్పుడు చండీఘడ్ లోనూ అదే గేమ్ ఆడేందుకు కేంద్రం పావులు కదుపుతోంది.

ఆప్ గెలుపుతో చండీఘడ్ టార్గెట్

ఆప్ గెలుపుతో చండీఘడ్ టార్గెట్

ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు అధికారంలో ఉండగా.. పంజాబ్ విషయంలో అంతగా జోక్యం చేసుకోని బీజేపీకి తాజాగా అక్కడ కాంగ్రెస్, బీజేపీల్ని ఊడ్చేసిన ఆప్ మాత్రం కంటగింపుగా మారింది. దీంతో ఆప్ కు వచ్చీరావడంతోనే ముందరికాళ్లకు బంధం వేసేలా చండీఘడ్ ను కేంద్రం టార్గెట్ చేస్తోంది. వాస్తవానికి చండీఘడ్ హర్యనా, పంజాబ్ రెండు రాష్ట్రాలకు రాజదానితో పాటు కేంద్రపాలిత ప్రాంతం కూడా. అయితే హర్యానాలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. దీంతో ఇప్పుడు ఆప్ కు వ్యతిరేకంగా అక్కడ బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోంది.

ఉద్యోగులకు ఎరతో మొదలు

ఉద్యోగులకు ఎరతో మొదలు

చండీఘడ్ లో ఉన్న ఉద్యోగులు ఇప్పటివరకూ పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాల పరిధినే ఉన్నారు. కేంద్రం మాత్రం తాజాగా వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్ని వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వారు సంతోషంగా ఉన్నారు. జీతాల్ని ఎరగా చూపి వారిని కేంద్రం పరిధిలోకి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. చండీఘడ్ విషయంలో ఆప్ సర్కార్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అక్కడి ఉద్యోగుల్ని ముందుగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ఇప్పుడు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తున్న మహిళలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏడాదికి బదులుగా రెండేళ్లు చైల్డ్ కేర్ లీవ్ లభించనుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెరుగుతుంది. చండీగఢ్ పరిపాలనలో దాదాపు 16,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఆ తర్వాత పంజాబ్, హర్యానా, రాజస్ధాన్, హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ, చండీఘడ్ లకు వర్తించే భాక్రా-బియాస్ మేనేజ్ మెంట్ బోర్డు నుంచి పంజాబ్ ను తప్పిస్తూ కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. తద్వారా పంజాబ్ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలూ చేస్తోంది.

చండీఘడ్ లోనూ ఢిల్లీ తరహా గేమ్

చండీఘడ్ లోనూ ఢిల్లీ తరహా గేమ్

ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలోనూ బీజేపీ గతంలో ఇలాంటి ఎత్తులే వేసింది. ఇప్పటికీ వేస్తూనే ఉంది. తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో విలీనాల ప్రక్రియకు తెరలేపింది. గతంలో అక్కడ ప్రభుత్వం కంటే లెఫ్టినెంట్ గవర్నర్ కు అన్ని అధికారాలు ఉండేలా పార్లమెంటులో చట్టాలే చేసేసింది. ఇప్పుడు చండీఘడ్ విషయంలోనూ పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా లెఫ్టినెంట్ గవర్నర్ అన్ని అధికారాలు చెలాయించేలా చేయాలనేది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. దీంతో పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ తో పాటు కాంగ్రెస్, అకాలీదళ్ కూడా బీజేపీ తీరుపై మండిపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+