వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. పార్లమెంట్ తర్వాత అనుకున్నాం.. కాని బీజేపి తెలుగు రాష్ట్రాల్లో ముందే మొదలెట్టేసింది..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డే దిశ‌గా క‌మ‌లం పార్టీ క‌స‌ర‌త్తు మొద‌లుపట్టింది. ఇందులో భాగంగా భారీ ఎత్తున చేరిక‌ల‌ను ప్రోత్సహించేందుకు నిర్ణ‌యించింది. ప్రధానంగా ప్రతిప‌క్షాల‌ను టార్గెట్ చేసి అందులోని ఆర్థికంగా, సామాజికంగా బ‌ల‌మైన నేత‌ల‌ను చేర్చుకునేందుకు ఎత్తుగ‌డ వేసింది. ఇందుకు ఏపీలో ఒక‌లా.. తెలంగాణ‌లో మ‌రోలా ప్లాన్ చేసింది. ఏపీలో బీజేపీ సంస్థాగ‌తంగా బాగా వీక్‌గా ఉంది. తెలంగాణ‌లో మాత్రం సంస్థాగ‌తంగా బ‌ల‌పడాల‌ని ప్రయ‌త్నిస్తోంది. ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో అధికారం ద‌క్కించుకునే దిశ‌గా క‌స‌ర‌త్తు మొద‌లెట్టింది. ఇందులోభాగంగా గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన నేత‌లు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది. ఏపీలో మాత్రం ఎంపీల‌పై ఫోక‌స్ పెట్టింది.

లోక్ సభ తర్వాత అనుకున్నాం..! వేడిలో వేడిగా బీజేపి పని మొదలు పెట్టింది..!!

లోక్ సభ తర్వాత అనుకున్నాం..! వేడిలో వేడిగా బీజేపి పని మొదలు పెట్టింది..!!

ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డి మూడు లేదా నాలుగు రాష్ట��రాల్లో పాగా వేయాల‌ని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఏపీ, తెలంగాణ‌ను క‌మ‌లం పార్టీ టార్గెట్ చేసింది. క‌ర్ణాట‌క‌లో సొంతంగానూ, త‌మిళ‌నాడులో పొత్తుల‌తో అధికారం ద‌క్కించుకునే ప్రయ‌త్నాలు చేస్తోంది. ఇదిలాఉంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రస్తుతం బ‌లహీనంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో ఆ పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నది. 118 స్థానాల్లో పోటీ చేస్తే కేవ‌లం ఒకేఒక్క స్థానంలో గెలిచింది. అయితే.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అనూహ్య ఫ‌లితాలు రాబ‌ట్టింది. ఏకంగా తెరాస బ‌లంగా ఉన్న నాలుగు స్థానాల‌ను క‌మ‌లం త‌న ఖాతాలో వేసుకుంది. దీంతో తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుకు ఆశ‌లు చిగురించాయి.

తెలుగు రాష్ట్రాలే లక్ష్యం..! కీలక నేతలకు గాలం..!!

తెలుగు రాష్ట్రాలే లక్ష్యం..! కీలక నేతలకు గాలం..!!

ఇందులోభాగంగా తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ క‌మ‌లానికి తెర తీసింది. అయితే.. అధికార పార్టీని ప‌క్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా మునుగోడు నుంచి గెలిచిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీ తీర్థం తీసుకోవ‌డం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కూడా బీజేపీలో పునరాగ‌మ‌నం చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వీరితోపాటు ములుగు ఎమ్మెల్యే సీత‌క్క ��ు కూడా పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయ‌త్నిస్తోంది. మ‌రోవైపు వాస్తవానికి వీరు పార్టీ మారిన ప‌ద‌వుల‌కు వ‌చ్చిన ఇబ్బందేమీ ఉండ‌దు. సాంకేతికంగా చూస్తే వీరు కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచినా.. ప్రస్తుతం కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్షం తెరాస‌లో వీలినం జ‌రిగింది. దీంతో వీరు పార్టీ మారినా.. అన‌ర్హత వేటు వేసేంద‌కు వీలు ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌రోవైపు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఒక కార్పొరేట‌ర్, గ‌త ఎన్నిక‌ల్లో కూక‌ట్‌ప‌ల్లి నుంచి పోటీ చేసి అభ్య‌ర్థి పన్యాల హ‌రీష్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకుంది.

బీజేపి వలలో ఈసీగా చిక్కుతున్న చేపలు..! ప్రాంతీయంగా బలపడడమే బీజేపి ద్యేయం..!!

బీజేపి వలలో ఈసీగా చిక్కుతున్న చేపలు..! ప్రాంతీయంగా బలపడడమే బీజేపి ద్యేయం..!!

అలాగే క‌లిసివ‌చ్చే మ‌రికొంద‌రు నాయ‌కుల‌ను కూడా పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయ‌త్నిస్తోంది. ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే గ‌త ఎన్నిక‌ల్��ో ఆ పార్టీచేదు ఫ‌లితాలు వ‌చ్చాయి. దాదాపు అభ్యర్థులంద‌రూ డిపాజిట్ కోల్పోయిన ప‌రిస్థితి. ఈ ద‌శ‌లో పార్టీ బ‌ల‌ప‌డ‌టం కంటే అధికారికంగా బ‌లం పుంజుకునేందుకు నిర్ణయించింది. ఇందుకు తెదేపా రాజ్యస‌భ స‌భ్యుల‌ను టార్గెట్ చేసింది. పార్టీలో చేర్చుకునే కంటే ఏకంగా తెదేపా రాజ్యస‌భాప‌క్షాన్ని విలీనం చేయ‌డ‌మే బెట‌ర్‌గా భావించింది. ఇందులో భాగంగా తెదేపాకు చెందిన న‌లుగురు రాజ్యస‌భ స‌భ్యుల‌ను బీజేపీలో విలీనం చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. వీరందరికి మ‌రోసారి రాజ్యస‌భ ఇస్తామ‌ని బీజేపీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. బీజేపీలో విలీనం చేయాల‌ని కోరుతూ న‌లుగురు రాజ్యస‌భ స‌భ్యులు రాజ్యస‌భ ఛైర్మన్ వెంక‌య్యనాయుడును క‌లిసి లేఖ ఇచ్చారు. వాస్తవానికి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కూడా బీజేపీలో చేర‌తార‌ని ప్రచారం జ‌రిగింది.

ఒక దెబ్బ రెండు పిట్టలు..! ఆంద్ర తెలంగాణాలో బీజేపి ప్రభావం..!!

ఒక దెబ్బ రెండు పిట్టలు..! ఆంద్ర తెలంగాణాలో బీజేపి ప్రభావం..!!

అయితే.. లోక్‌స‌భ‌లో సంఖ్యాబ‌లంగా ప‌రంగా బీజేపీకి ఎలాంటి ఢోకా లేదు. దీంతో బీజేపీ అంత‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చలేదు. అయితే.. రాజ్యస‌భలో బీజేపీకి సంఖ్యాబ‌లం త‌క్కువ‌గా ఉంది. చాలావ‌ర‌కు బిల్లలు లోక్‌స‌భ‌లో పాస్ అయిన‌ప్పటికీ రాజ్యస‌భ‌లో సంఖ్యాబ‌లం లేక‌పోవ‌డంతో వీగిపోతున్నాయి. దీంతో రాజ్యస‌భ సంఖ్యాబ‌లం పెంచుకునే��దుకు తెదేపా స‌భ్యుల‌ను టార్గెట్ చేసింది. పార్టీ మారేందుకు నిర్ణయించిన వారిలో ఇద్దరికి వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు ప‌ద‌వీకాలం ఉండ‌గా.. మ‌రో ఇద్దరికి 2022 వ‌ర‌కుప‌ద‌వీ కాలం ఉంది. మ‌రో విశేష‌మేమిటంటే న‌లుగురు ఎంపీలుగా కూడా చంద్రబాబుకు అత్యంత స‌న్నిహితులు. చంద్రబాబు యూరప్ లోఉన్న స‌మ‌యంలో పార్టీ విలీనానికి ప్రతిపాదించారు. దీంతో తెలంగాణ‌లో క్షేత్రస్థాయిలో బ‌ల‌ప‌డాల‌ని, ఏపీని వాడుకుని రాజ్యస‌భ‌లో బ‌ల‌ప‌డే దిశ‌గా బీజేపీ నిర్ణయించి ప్లాన్ అమ‌లు చేసింది.

English summary
Kamalam Party has started its campaign towards strengthening Telugu states.As part of this,it has decided to promote large scale inclusions.It mainly targeted the opposition and made moves to include its economically and socially powerful leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X