Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చతుర్ముఖ పోటీలే: బీజేపీ బలంగా కనిపించినా ఎన్పీపీ శక్తిమంతం

Recommended Video

    Meghalaya Assembly Polls 2018 Update | Oneindia Telugu

    షిల్లాంగ్: నాగాలాండ్‌తోపాటు మేఘాలయ అసెంబ్లీకి ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగనున్నది. మేఘాలయ 50 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వల్లే ఆ రాష్ట్రం అభివ్రుద్ధికి దూరమైందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. దీనివల్ల చాలా సమయం వ్రుధాగా సాగిపోయిందని తనదైన శైలిలో 'హస్తం' పార్టీపై దండెత్తారు. మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికల సమరం చతుర్ముఖ పోటీగా కనిపిస్తున్నది. అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ, ప్రాంతీయ పార్టీలు ఎన్పీపీ, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) పోటీ పడుతున్నాయి.

    ముకుల్ సంగ్మా సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత

    ముకుల్ సంగ్మా సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత

    1972లో మేఘాలయ ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రం శక్తిమంతమైనదిగానే ఉన్నది. ఒక ఐదేళ్లపాటు మాత్రమే కాంగ్రెసేతర ప్రభుత్వం మేఘాలయలో పని చేసింది. కానీ ప్రస్తుతం 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అతిపెద్ద సవాల్ ఎదుర్కొన్నది. ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ ఎదుర్కొంటున్నది. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ఆరుగురు స్వతంత్ర శాసనసభ్యులు కూడా మద్దతు ఉపసంహరించుకోవడంతోపాటు ఎన్పీపీలోనో, బీజేపీలోనో చేరిపోయారు.

    మోదీ వల్లే కాంగ్రెస్ పార్టీ ఇలా పతనం

    మోదీ వల్లే కాంగ్రెస్ పార్టీ ఇలా పతనం

    ఈశాన్య భారత రాష్ట్రాల్లో మిజోరం రాష్ట్రంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం మేఘాలయ. గత నాలుగేళ్లలో అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. దీనికి ‘మోదీ' ప్రభావం ఒక కారణం. లోక్ సభ ఎన్నికల్లో అతి తక్కువగా కాంగ్రెస్ బలం 44 స్థానాలకు పడిపోవడానికి మోదీ ప్రభావమే కారణం అని చెబుతున్నారు.

    ఒక్కసారే మేఘాలయలో స్పష్టమైన తీర్పు

    ఒక్కసారే మేఘాలయలో స్పష్టమైన తీర్పు

    తొలి నుంచి మేఘాలయ ప్రజలు ప్రత్యేకించి ఓటర్లు హంగ్ తీర్పునిచ్చారు. స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటివరకు మేఘాలయ శాసనసభకు తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి మాత్రమే స్పష్టమైన తీర్పు వచ్చింది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (ఏహెచ్ఎల్) 60 స్థానాలకు 32 స్థానాలను గెలుచుకని అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పక్షంగా అవతరించిందంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఎన్నికల తర్వాత స్వతంత్రులు మరింత స్ఫూర్తితో పాలనలో భాగస్వాములయ్యారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత అత్యధికంగా స్వతంత్రులే ఎక్కువ ఓట్ల శాతం పొందారు. 2003 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటానికి స్వతంత్రులే కారణం అన్న అభిప్రాయం వినిపిస్తున్నది.

    అభ్యర్థులంతా విజయాధిక్యతలు 1000 ఓట్లలోపే

    అభ్యర్థులంతా విజయాధిక్యతలు 1000 ఓట్లలోపే

    కొంత మంది అత్యున్నత స్థాయి ప్రొఫైల్ కల స్వతంత్ర ఎమ్మెల్యేలు ఈ దఫా పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 10 మంది ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి రోబినస్ సైంగకోన్, జస్టిన్ డార్, ఎడ్మండ్ సంగ్మా, సయ్యదుల్లా నాంగ్రూం బీజేపీ తరపున పోటీ చేస్తుండగా, ఎన్పీపీ నుంచి హోప్ ఫుల్ బామన్, స్టీఫాన్సన్ ముఖిం బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రిగేడీ మరాక్, మిచైల్ సంగ్మా మరోసారి తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలంటే ముఖాముఖీ పోటీలేనన్న అభిప్రాయం ఉన్నది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో విజయాధిక్యతలు కేవలం 1000 ఓట్ల లోపేనంటే అతిశయోక్తి కాదు.

    నాగాలాండ్, మేఘాలయల్లో విడివిడిగా ఎన్డీయే పక్షాల పోటీ

    నాగాలాండ్, మేఘాలయల్లో విడివిడిగా ఎన్డీయే పక్షాల పోటీ

    ఇక్కడ మరో విశేషం కూడా ఉన్నది. ఎన్డీయే, ఎన్ఈడీఏ మిత్రపక్షాలు మేఘాలయలో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. 60 అసెంబ్లీ స్థానాల్లో 55 స్థానాలను ఎస్టీలకే రిజర్వు చేశారు. ఖాసీ హిల్స్ ప్రాంతంలో 24, గైరో కొండల్లో 24, జైనితా కొండ ప్రాంతాల్లో ఏడు, రియో భోయి ప్రాంతంలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 85 శాతం. వారిలో 75 శాతం మంది క్రైస్తవులు కూడా. రెండు ప్రదాన ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ), లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా సారథ్యంలోని నేషనలిస్టు పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)లు ఎన్ఈడీఏ భాగస్వామ్య పక్షాలు. రాష్ట్రంలో చతుర్ముఖ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఏ పార్టీ ఆధిక్యం సాధిస్తుందన్న విషయం నిర్ధారించడం కష్టసాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

    2014 ఎన్నికల తర్వాత ఇలా మారిన ఈశాన్య భారత రాజకీయం

    2014 ఎన్నికల తర్వాత ఇలా మారిన ఈశాన్య భారత రాజకీయం

    బీజేపీ, దాని మిత్ర పక్షాలు విడిగా పోటీ చేసినా.. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మేఘాలయ పరిస్థితిని నిర్దేశించే అవకాశాలు కనిపించడం లేదు. 2014 లోక్ సభ ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. బీజేపీ ప్రధాన శక్తిగా ఎదుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మేఘాలయలో శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రాభవం కొడిగట్టిపోతున్నా కొద్దీ కన్రడ్ సంగ్మా సారథ్యంలోని ఎన్పీపీ మరింత శక్తిని పుంజుకుంటున్నదన్న సంకేతాలు వస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ శాతం, ఆ యా పార్టీల పట్ల ప్రజలు నేతల ప్రతిస్పందన ఈ సంగతిని తెలియజేస్తున్నది.

    నేతల ప్రజాదరణను బట్టే ఎన్నికల ఫలితాలు ఖరారు

    నేతల ప్రజాదరణను బట్టే ఎన్నికల ఫలితాలు ఖరారు

    ఈశాన్య ప్రాంత ఓటర్లు పోటీలో ఉన్న నాయకులకు మాత్రమే ప్రాదాన్యం ఇస్తారే తప్ప పార్టీలకు కాదు. పార్టీల నాయకులకు లభిస్తున్న ప్రజాదరణను బట్టి ఎన్నికల ఫలితాలు ఖరారవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పీఏ సంగ్మా చరిస్మాతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కన్రడ్ సంగ్మా.. 2014లో గ్యారో హిల్స్ నుంచి అదీ కూడా సీఎం ముకుల్ సంగ్మాకు బలమైన కేంద్రం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దీనికి 2014లో మోదీ ప్రభావం కూడా కలిసి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీతోనూ జత కట్టబోమని చెబుతున్నా.. బీజేపీ, యూడీపీల్లో ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    హిందుత్వ, బీఫ్ నినాదం ఊసెత్తని కమలనాథులు

    హిందుత్వ, బీఫ్ నినాదం ఊసెత్తని కమలనాథులు

    మేఘాలయ అసెంబ్లీ పరిధిలో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు అడ్డూ అదుపే లేదు. ఇక బీజేపీ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకుని అభ్యర్థులుగా గెలుపొందింది. కానీ బీజేపీ హిందుత్వ నినాదం ఊసెత్తడం లేదు. బీఫ్ తినొద్దన మాటే చెప్పడం లేదన్న అభిప్రాయం ఉన్నది. కేవలం ‘ప్రగతి' నినాదంతో కమలం పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. యూడీపీ.. గత ఎన్నికల్లో 4.2 శాతం ఓట్లు పొందిన హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, గ్యారో నేషనల్ కౌన్సిల్ (0.7%)లతో పొత్తు పెట్టుకున్నది. లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ఆయన కుమారుడు కన్రడ్, కూతురు అగథా సంగ్మా కూడా.. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+