బీజేపీకి 150 సీట్లు గ్యారెంటీ, సిద్దూ రాక్షసపాలన, సీఎంగా ఆరోజు ప్రమాణస్వీకారం: యడ్యూరప్ప!
శివమొగ్గ: కర్ణాటకలో బీజేపీ 150 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని కర్ణాటక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్. యడ్యూరప్ప అన్నారు. కర్ణాటకలో ఐదు సంవత్సరాల సిద్దరామయ్య ప్రభుత్వ రాక్షస పాలనతో ప్రజలు విసిగిపోయారని బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. తన ప్రమాణస్వీకారానికి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని బీఎస్. యడ్యూరప్ప అన్నారు.
Recommended Video


పోలింగ్ శాతం పెరిగింది
కాంగ్రెస్ పార్టీ నియంత పాలనలో కర్ణాటక ప్రజలు విసిగిపోయారని, అందుకే బీజేపీకి ఓటు వెయ్యడానికి ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారని బీఎస్ యడ్యూరప్ప అన్నారు. పోలింగ్ శాతం పెరగడం చూస్తే సిద్దరామయ్య ప్రభుత్వం మే 15వ తేదీన కూప్పకూలిపోతుందని స్పష్టంగా కనపడుతోందని బీఎస్. యడ్యూరప్ప అన్నారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వం
కర్ణాటకలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలంటే బీజేపీకి ఓటు వెయ్యాలని బీఎస్. యడ్యూరప్ప ప్రజలకు మనవి చేశారు. శివమొగ్గ జిల్లా శికారిపురలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న బీఎస్. యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య రాక్షసపాలన త్వరలో అంతం అవుతోందని జోస్యం చెప్పారు.

మే 17 ప్రమాణస్వీకారం
150 సీట్లతో తాము అధికారంలోకి వస్తామని బీఎస్ యడ్యూరప్ప అన్నారు. మే 17వ తేదీ బెంగళూరులో తాను ప్రమాణస్వీకారం చేస్తానని బీఎస్. యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఓటు వెయ్యకముందు బీఎస్. యడ్యూరప్ప శికారిపురలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మోడీ, అమిత్ షా హవా
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారం చేశారని, ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారని, కచ్చితంగా ఆ ప్రభావంతో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీఎస్ యడ్యూరప్ప అన్నారు. తాను మళ్లీ సీఎం అవుతానని సిద్దరామయ్య కలలుకంటున్నారని యడ్యూరప్ప వ్యంగంగా అన్నారు.












Click it and Unblock the Notifications