వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైపోల్స్‌లో బీజేపీ జోరు: ఢిల్లీలో కేజ్రీకి షాక్, 10స్థానాల్లో 5గెలుపు

ఇటీవల 8రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన రెండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లు చెరొకటి గెలుచుకున్నాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల 8రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లోనూ బీజేపీ హవా కొనసాగింది. హిమాచల్‌ప్రదేశ్‌ భోరంజ్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కర్ణాటకలోని గుండ్లుపేట అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి గీతా మహాదేవప్రసాద్‌ విజయం సాధించారు.

ఢిల్లీ: రాజౌరి గార్డెన్‌లో బీజేపీ ఘన విజయం, ఆప్ డిపాజిట్లు గల్లంతు

- 14వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలుపు
-కాంగ్రెస్ రెండోస్థానం, ఆప్ డిపాజిట్ గల్లంతు

-గుండ్లుపేట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది

-భోరంజ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అనీల్ ధీమన్ గెలుపొందారు.

-బాంధవగఢ్ నుంచి బీజేపీ అభ్యర్థి శివనారాయణ్ సింగ్ గెలుపొందారు.

-కాంతి దక్షిణ్ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి చంద్రిమా భట్టాచార్య గెలుపొందారు.

-ధేమాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రానోజ్ పేగు గెలుపొందారు.

-రాజస్థాన్‌లోని ధోలాపూర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి శోభారాణి కుష్వా గెలుపొందారు.

BJP wins in Himachal, leads in 5 other seats; counting halted in MP's Ater, Congress alleges EVM tampering

థీమజీ(అస్సాం), భోరంజ్(హిమాచల్ ప్రదేశ్), అతెర్, బాంధవ్ గఢ్(మధ్యప్రదేశ్), కంతీదక్షిన్(వెస్ట్ బెంగాల్), ధోల్ పూర్(రాజస్థాన్), నజంగుడు, గుండ్లుపేట్(కర్ణాటక), లతిపురా(జార్ఖండ్), ఉప్పేర్ బురత్ తూక్(సిక్కిం), రాజౌరి గార్డెన్(ఢిల్లీ) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అలాగే శ్రీనగర్ లోకసభ స్థానం ఉప ఎన్నికల్లో పోలింగ్ అత్యల్పంగా నమోదైన బుద్గాం జిల్లాలోని 38 పోలింగ్ కేంద్రాల్లో గురువారం రీపోలింగ్ జరుగుతోంది.

కాగా, ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. గతంలో ఈ స్థానంలో భారీ మెజార్టీతో గెలుపొందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. ఇక్కడ బీజేపీ గెలవడంతో ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 70 మంది ఎమ్మెల్యేలలో ఒకరు తగ్గిపోయారు.

రాజౌరీ గార్డెన్‌ సిట్టింగ్‌ ఆప్‌ ఎమ్మెల్యే జర్నాలీ సింగ్‌ పదవిని వదిలి పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. జర్నాలీ సింగ్‌ రాజీనామాతో రాజౌరీ గార్డెన్‌ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానంలో ఆప్‌ కొత్త వ్యక్తి హర్జీత్‌ సింగ్‌ను నిలబెట్టగా, బీజేపీ నుంచి సీనియర్‌ నేత మన్‌జిందర్‌ సింగ్‌ సిర్సా, కాంగ్రెస్‌ నుంచి మీనాక్షి చందేలా పోటీ పడ్డారు. త్వరలో ఢిల్లీలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, పలు చోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ ఆందోళలకు దిగింది.

English summary
The BJP has taken lead in five of 10 assembly seats in eight states, including Delhi; the ruling AAP is trailing at number 3 in Delhi's Rajouri Garden, where by-polls for assembly seat come just weeks before the high-stake civic body elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X