వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలేజ్ విద్యార్థులు VS బీజేపీ: మీరు భారతీయులేనా ? పాకిస్థాన్ వెళ్లిపోండి, బెంగళూరులో రచ్చ రచ్చ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్ సీలకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని బెంగళూరులోని విద్యార్థులు తేల్చిచెప్పడంతో బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. బీజేపీ చేపట్టిన సీఏఏ జనజాగృతి కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ చేసే సందర్బంగా బీజేపీ కార్యకర్తలు VS కాలేజ్ విద్యార్థుల మధ్య వాగ్వివాదం జరగడంతో బెంగళూరు నగరంలోని కోరమంగలలోని జ్యోతి నివాస్ కాలేజ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీరు అసలు భారతీయులేనా ? వెంటనే పాకిస్థాన్ వెళ్లిపోండి అంటూ బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోవడంతో కాలేజ్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యానంద స్వామి అక్రమాలు?, అమ్మాయిల నగ్న వీడియోలతో వాట్సాప్ గ్రూప్, పోర్న్ వీడియోలు, శర్మా!నిత్యానంద స్వామి అక్రమాలు?, అమ్మాయిల నగ్న వీడియోలతో వాట్సాప్ గ్రూప్, పోర్న్ వీడియోలు, శర్మా!

కాలేజ్ విద్యార్థులపై ఒత్తిడి!

కాలేజ్ విద్యార్థులపై ఒత్తిడి!

బెంగళూరు నగరంలోని కోరమంగలలోని జ్యోతి నివాస్ కాలేజ్ లోని విద్యార్థులకు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అవగాహన కల్పించి వారి నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ కార్యకర్తలు ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జ్యోతి నివాస్ కాలేజ్ లోకి బీజేపీ కార్యకర్తలు వెళ్లారు. గోడలకు సీసీఏకి మద్దతుగా రాసిన బ్యానర్లు కట్టి పౌరసత్వ సవరణ చట్టంకు మద్దతు తెలిపి నినాదలు చేసి బ్యానర్ లో సంతకాలు చెయ్యాలని బీజేపీ నాయకులు బలవంతం చేశారు. ఆ సమయంలో విద్యార్థులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 మీరు భారతీయులేనా ?, పాకిస్థాన్ వెళ్లిపోండి!

మీరు భారతీయులేనా ?, పాకిస్థాన్ వెళ్లిపోండి!

విద్యార్థులతో బలవంతంగా సంతకాలు చేయించడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో కాలేజ్ ప్రిన్సిపల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ మీకు పౌరసత్వ సవరణ చట్టం గురించి అవగాహనలేదని, మీరు భారతదేశం గురించి కనీసం ఆలోచించడంలేదని, మీరు ఎప్పుడు కాలేజ్ గురించి మాత్రమే ఆలోచిస్తారని, మీరు అసలు భారతీయులు లాగా ఎక్కడా ఆలోచించడంలేదని, మీరు అసలు భారతీయులేనా ?, వెంటనే మీరు పాకిస్థాన్ వెళ్లిపోవాలని మండిపడ్డారు. ఆ సమయంలో విద్యార్థినిలు ఎదురు తిరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను కాలేజ్ ఆవరణం నుంచి బయటకు పంపించేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి ఫైర్

జ్యోతి నివాస్ కాలేజ్ లో విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ కార్యకర్తలపై బెంగళూరులోని జయనగర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి మండిపడ్డారు. కాలేజ్ విద్యార్థులపై బీజేపీ కార్యకర్తలు ఎలా ప్రవర్తించారో మీరే చూడండి అంటూ ఓ వీడియో ట్వీట్టర్ లో పోస్టు చేసిన ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీకు ఎంత ధైర్యం, మాజీ సీఎం సిద్దూ

మీకు ఎంత ధైర్యం, మాజీ సీఎం సిద్దూ

కాలేజ్ విద్యార్థులపై బీజేపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారని తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య సైతం మండిపడ్డారు. మీకు ఎంత ధైర్యం ఉంటే కాలేజ్ విద్యార్థులతో పెట్టుకుంటారు అని సిద్దరామయ్య బీజేపీ నాయకులు, కార్యకర్తలను ప్రశ్నించారు. సీఎం బీఎస్. యడియూరప్ప చోద్యం చూస్తున్నారని, కాలేజ్ విద్యార్థులపై దౌర్జన్యం చేసిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను కనీసం మందలించలేదని సిద్దరామయ్య ఆరోపించారు.

 హోం మంత్రి ఏం చెప్పారు ?

హోం మంత్రి ఏం చెప్పారు ?

కాలేజ్ విద్యార్థులు, బీజేపీ కార్యకర్తల వాగ్వివాదం విషయంపై కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీడియాతో మాట్లాడారు. బెంగళూరు నగరంలోని జ్యోతి విలాస్ కాలేజ్ లో జరిగిన సంఘటనపై దర్యాప్తు చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని హో మంత్రి బసవరాజ్ బోమ్మయ్ తెలిపారు.

English summary
CAA: BJPs Pro CAA Sign Movement Goes Wrong In Bengaluru. Clashes between BJP Activists and Jyoti Nivas College Students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X