రైతు నేత రాకేష్ తికాయత్ కు షాక్- బెంగళూరులో నల్ల సిరా పోసిన అగంతకులు

రైతుసంఘాల నేత రాకేష్ తికాయత్ కు ఇవాళ అనూహ్య ఘటన ఎదురైంది. కర్నాటకలోని బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాకేష్ తికాయత్ పై ఓ గుర్తుతెలియని వ్యక్తి నల్ల సిరా జల్లాడు. దీంతో సభలో కలకలం రేగింది. చివరికి సదరు వ్యక్తిని స్ధానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Recommended Video

    Rakesh Tikait మొఖం పై ఇంక్ దాడి... కారణమిదే #Politics | Telugu Oneindia

    బెంగళూరులో రైతు సంఘాలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాకేష్ తికాయత్ వచ్చారు. ఆయన రాకను నిరసిస్తూ స్ధానికంగా కొందరు దాడికి ప్రయత్నించారు. తికాయత్ పాల్గొన్న సభలో కుర్చీలు విసిరేశారు. గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో ఇందులో ఒకరు తికాయత్ మొహం, దుస్తులపై నల్ల సిరా పోశారు. దీంతో పరిస్ధితి మరింత గందరగోళంగా మారింది. తికాయత్ పై నల్ల సిరా వేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

    Black ink thrown at BKU Leader Rakesh Tikait in Bengaluru

    ఇక్కడ స్థానిక పోలీసులు ఎటువంటి భద్రత కల్పించలేదని రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఇది ప్రభుత్వంతో కుమ్మక్కై జరిగిందని సిరా దాడి తర్వాత తియాకత్.. మీడియాకు తెలిపారు. సిరా దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కర్నాటకకు చెందిన ఒక రైతు నాయకుడు డబ్బు అడుగుతూ పట్టుబడిన స్టింగ్ ఆపరేషన్‌పై స్పష్టత ఇవ్వడానికి విలేకరుల సమావేశం జరిగింది. దీన్ని నిర్వహించడం ఇష్టం లేని వారే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

    గతంలో రైతుల తరఫున వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన కీలక నేతల్లో రాకేష్ తికాయత్ కూడా ఒకరు. అప్పటి నుంచి ఆయన బీజేపీ నేతలకు శత్రువుగా మారిపోయారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ప్రచారం కూడా చేశారు. దీంతో ఆయనపై కక్ష ఉన్నవారే ఈ సిరా దాడికి పాల్పడి ఉండొచ్చని తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+