ఉత్తరప్రదేశ్ లో బాంబు పేలుడు: రైల్వే ట్రాక్ పక్కనే నాలుగు బాంబులు సీజ్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని సంత కబీర్ నగర్ లోని రైల్వే ట్రాక్ సమీపంలో మంగళవారం ఉదయం బాంబు పేలిపోవడంతో స్థానికులు హడలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

రైల్వే ట్రాక్ సమీపంలో నాలుగు నాటు బాంబులను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ట్రాక్ సమీపంలో తక్కువ సామర్థ్యం ఉన్న నాటు బాంబు పేలిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

Blast near railway track at Kabir Nagar in Uttar Pradesh

విషయం తెలుసుకున్న ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే ఇది ఉగ్రవాదుల దాడికాదని అధికారులు అంటున్నారు. స్వాధీనం చేసుకున్న నాటు బాంబులను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A minor intensity blast has been reported near a railway track at the Sant Kabir Nagar in Uttar Pradesh.
Please Wait while comments are loading...