నితీశ్ సభకు సమీపంలో పేలుడు.. కేవలం 20 ఫీట్ల దూరంలో బ్లాస్ట్.. సేఫ్
బీహర్ సీఎం నితీశ్ కుమార్ తృటిలో తప్పించుకున్నారు. ఆయన సభ వేదికకు కూతవేటు దూరంలో పేలుడు జరిగింది. అయితే అదీ బాణాసంచా కావడంతో భద్రతా సిబ్బంది పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నితీశ్ సొంత జిల్లా నలందలో గల సిలావ్‌లో మంగళవారం జరిగింది. నితీష్ స్టేజీకి కేవలం 20 ఫీట్ల దూరంలో పేలుడు సంభవించింది.
సొంత జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు నితీశ్ కుమార్ వచ్చారు. బహిరంగ సభ వేదికపై ఆశీనులు అయ్యారు. ఇంతలో స్వల్పంగా పేలుడు జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థం బాణా సంచా, అగ్గిపెట్టేను కూడా స్వాధీనం చసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతుందని వారు తెలియజేశారు.

గత నెలలో బక్తియపూర్‌లో కూడా బహిరంగ సభలో ఇలాంటి ఘటన జరిగింది. అయితే ఆ సమయంలో సీఎం నితీశ్ కుమార్‌పై ఓ యువకుడు దాడి చేసేందుకు యత్నించారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మరవక ముందే తాజాగా మరొటి జరిగింది. బాంబు దాడి ఘటనతో నితీశ్ కుమార్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వార్తలకు బలం చేకూర్చినట్టయింది. వరసగా రెండోసారి యత్నించడంతో సీరియస్ నెస్ అర్థం అవుతుంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications