మెట్రో రైల్ స్టాఫ్ క్వార్టర్స్ బుగ్గి: కుటుంబం మొత్తం సజీవ దహనం
ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ మెట్రో రైల్ లిమిటెడ్ స్టాఫ్ క్వార్టర్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీ వాయువ్య ప్రాంతంలోని ఆదర్శ్ నగర్, మజ్లిస్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఈ ఘటన సంభవించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లో పని చేసే ఉద్యోగుల అధికారిక నివాస సముదాయాలు ఉన్నాయి ఇక్కడ. డీఎంఆర్సీకి చెందిన మేనేజర్ స్థాయి నుండి చాలామంది ఉద్యోగులు ఇక్కడ నివసిస్తోన్నారు. ఈ స్టాఫ్ క్వార్టర్స్‌లో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి.

వేకువజామున 2:39 నిమిషాల సమయంలో మజ్లిస్ పార్క్ మెట్రోకు ఎదురుగా ఉన్న ఎఫ్ బ్లాక్ క్వార్టర్స్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు. వారిని అజయ్ విమల్ (42), ఆయన భార్య నీలమ్ (38), వారి కుమార్తె జాన్వి (10)గా గుర్తించారు. ఎఫ్ బ్లాక్ బిల్డింగ్ అయిదో అంతస్తులోని ప్లాట్‌లో వారు నివసిస్తోన్నారు. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
ఇంట్లో అన్ని గృహోపకరణాలు కాలిపోయాయి. అగ్నికీలలు ఇతర నివాసాలు, ఫ్లాట్లకు వ్యాపించకుండా ఉండటానికి ఆరు ఫైరింజిన్లతో అదుపు చేయాల్సి వచ్చిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమారు గంటపాటు నిరంతరాయంగా సిబ్బంది పని చేశారు. తెల్లవారు జామున 3:25 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయి.
మంటలు ఆర్పివేసిన అనంతరం ఫ్లాట్ నుండి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. ఈ క్రమంలో ఫైర్‌మెన్ రాకేష్ చేతికి గాయాలయ్యాయి. ఆయనను జగ్జీవన్ రామ్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications