వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్తమోడుతున్న చెయ్యితో బారికేడ్ల పైకి ఎక్కిన జామియా విద్యార్థి..

|
Google Oneindia TeluguNews

Recommended Video

రక్తమోడుతున్న చెయ్యితో బారికేడ్ల పైకి ఎక్కిన విద్యార్థి || Oneindia Telugu

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం వల్లే నిందితుడు కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు,కాల్పుల్లో గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. పోలీసులు బారికేడ్లను తొలగించడానికి నిరాకరించడంతో.. అతను బారికేడ్ల పైకి ఎక్కి అక్కడినుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు.

 రక్తమోడుతుండగా బారికేడ్లపై ఎక్కి..

రక్తమోడుతుండగా బారికేడ్లపై ఎక్కి..

రామ్‌భక్త్ గోపాల్ శర్మ (19) అనే యువకుడు జరిపిన కాల్పుల్లో జామియా వర్సిటీకి చెందిన షాదాబ్ ఫరూఖ్(25) అనే మాస్ కమ్యూనికేషన్ విద్యార్థికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నింగా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్ల ముందు భారీగా మోహరించబడిన పోలీసులు.. అతన్ని అక్కడినుంచి పంపించేందుకు నిరాకరించారు. చేసేది లేక..చేతి నుంచి రక్తమోడుతుండగా.. అతను పోలీస్ బారికేడ్ల పైకి ఎక్కి.. అక్కడినుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు.

 పోలీసులు పట్టించుకోకపోవడంతో...

పోలీసులు పట్టించుకోకపోవడంతో...

అక్కడే ఉన్న పలువురు విద్యార్థులు మొదట బారికేడ్లను తొలగించాల్సిందిగా పోలీసులకు ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో ఫరూఖ్ బారికేడ్ల పైకి ఎక్కాల్సి వచ్చింది. అనంతరం అతన్ని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అతన్ని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని స్పెషల్ పోలీస్ కమిషనర్ ప్రవీర్ రంజన్ పరామర్శించారు.

 నినాదాలు చేస్తూ కాల్పులు..

నినాదాలు చేస్తూ కాల్పులు..

కాల్పులకు పాల్పడ్డ రామ్‌భక్త్ గోపాల్‌ను అడ్డుకునే క్రమంలో ఫరూఖ్‌పై అతను కాల్పులు జరిపినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. తన ఫేస్‌బుక్ పేజీలో నిందితుడు పలు విద్వేషపూరిత,వివాదాస్పద పోస్టులు పెట్టినట్టు చెబుతున్నారు. 'ఆజాదీ కావాలా.. అయితే తీసుకోండి..', 'జైశ్రీరామ్' వంటి నినాదాలు చేస్తూ అతను కాల్పులకు తెగబడ్డట్టు చెబుతున్నారు.

 గతంలో బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు

గతంలో బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు

దేశ ద్రోహులను కాల్చిపారేయండి అంటూ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరునాడే జామియా వర్సిటీలో కాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం. ఇంతకుముందు పలువురు బీజేపీ నేతలు సైతం సీఏఏ నిరసనకారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాలను నిరసిస్తూ ప్రధాని మోదీ,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా

నినాదాలు చేసేవారిని ప్రాణం ఉండగానే పాతి పెట్టేస్తా అని బీజేపీ నేత రఘురాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా జామియా ఘటన దేశవ్యాప్తంగా సీఏఏ నిరసనకారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

English summary
The Jamia Millia Islamia student who suffered a bullet wound after a right-wing gunman opened fire on protesters taking out a march against CAA and NRC had to climb three police barricades to go to the hospital to be treated for his injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X