ఢిల్లీ అల్లర్లపై పుస్తకం: చివరి నిమిషంలో సంచలన ప్రకటన, తప్పుకుంటున్నామంటూ..!

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్లపై ఓ పుస్తకం రాశారు అడ్వకేట్ మోనికా అరోరా, సోనాలీ చితల్కర్ మరియు ప్రేరణ మల్హోత్రా. ఈ పుస్తకాన్ని ప్రముఖ పబ్లికేషన్ హౌజ్ బ్లూమ్స్ బరీ ఇండియా పబ్లిష్ చేసేందుకు ముందుకొచ్చింది. "ఢిల్లీ రాయిట్స్ 2020: ది అన్‌టోల్డ్ స్టోరీ" పేరుతో వచ్చిన ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయడం లేదని చివరి నిమిషంలో సంచలన ప్రకటన చేసింది బ్లూమ్స్ బరీ ఇండియా. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

బ్లూమ్స్ బరీ ప్రకటన

"బ్లూమ్స్ బరీ ఇండియా ఢిల్లీ రాయిట్స్ 2020 పుస్తకాన్ని సెప్టెంబర్‌లో పబ్లిష్ చేయాలని భావించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కారణాలు, అసలు అల్లర్లు ఎలా ప్రారంభం అయ్యాయి వంటి అంశాలను పుస్తకంలో పొందుపర్చడం జరిగింది. అల్లర్లను చూసిన ప్రత్యక్ష సాక్షులను పుస్తక రచయితలు విచారణ చేసి, కొన్ని ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి వచ్చిన అంశాలను ఇందులో పొందుపర్చారు. అయితే రచయితలు తమకు తెలియకుండానే ఆన్‌లైన్ ద్వారా పుస్తకం ప్రీ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అంతేకాదు కొన్ని పార్టీలకు చెందిన వ్యక్తులను కూడా ఈ కార్యక్రమానికి మా ఆమోదం లేకుండా ఆహ్వానించడం జరిగింది. అందుకే పుస్తకాన్ని పబ్లిష్ చేయాలన్న ఆలోచనను విరమించుకుంటున్నాం. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాం. వాక్‌స్వాతంత్రంకు బ్లూమ్స్‌బరీ ఇండియా ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అదే సమయంలో సమాజంలో కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది." అని తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.

విమర్శలు గుప్పించిన స్వరభాస్కర్

ఢిల్లీలో జరిగిన అల్లర్లపై పుస్తకం విడుదల కానుందనే వార్త ప్రచారంలోకి రాగానే సోషల్ మీడియాలో చాలామంది విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి బీజేపీ నేత కపిల్ మిశ్రా, సినీ దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, ప్రముఖ జర్నలిస్ట్ నుపూర్ జెశర్మ కూడా ఆహ్వానితులుగా ఉండటంతో విమర్శలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఇప్పుడు ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసి విడుదల చేస్తే అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుందనే విమర్శలు వచ్చాయి. పలువురు ప్రముఖులు అంటే రచయిత మీనాక్షిరెడ్డి మాధవన్, నటి స్వరభాస్కర్‌తో పాటు మరికొందరు ప్రముఖలు పుస్తకం విడుదలపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో దిగొచ్చిన బ్లూమ్స్‌బరీ.. ఆ కార్యక్రమానికి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది.

Recommended Video

    Boeing 777-300ER VVIP : A New Plane For Modi ఈ ‘ఎయిర్ ఇండియా వన్’ విమానం ఎంతో ప్రత్యేకం! || Oneindia

    కపిల్ మిశ్రా ఏమన్నారంటే

    ఇదిలా ఉంటే ఢిల్లీ రాయిట్స్ 2020: ది అన్‌టోల్డ్ స్టోరీ గురించి ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు బీజేపీ నేత కపిల్ మిశ్రా. పుస్తకం విడుదల అయ్యిందన్న కపిల్ మిశ్రా దేశానికి మరియు ప్రపంచానికి అసలు వాస్తవాలు తెలుస్తాయని రాసుకొచ్చారు. అంతేకాదు హిందువులకు వ్యతిరేకంగా ఈ అల్లర్లు జరిగాయనే సత్యం ప్రపంచానికి తెలుస్తుందని ట్వీట్ చేశారు. సత్యాన్ని తప్పుడు ప్రచారాలతోనో ఇతర విద్వేషాలు రెచ్చగొట్టో దాచలేరని ట్వీట్‌లో కపిల్ మిశ్రా పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+