బ్లూవేల్ గేమ్: ప్రాణాపాయం నుండి బయటపడ్డ ఇద్దరు బాలికలు

Posted By:
Subscribe to Oneindia Telugu

భోపాల్:బ్లూవేల్ గేమ్ ఆడకూడదని హెచ్చరించినా కొందరు పిల్లలు మాత్రం ఆ గేమ్‌ను మాత్రం వదలడం లేదు. ఈ గేమ్ ప్రభావం ఇండియాపై కూడ తీవ్రంగానే ఉంది. అయితే ఈ గేమ్‌ ఆడుతున్న ఇద్దరు బాలికలు చివరిక్షణంలో ప్రాణాలతో బయటపడ్డారు.

ఉత్తర్‌ప్రదే్ రాష్ట్రంలోని ఆగ్రాలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు కొంతకాలంగా బ్లూవేల్ ఛాలెంజ్‌కు బానిసలుగా మారారు.

Blue Whale Challenge: Two girls run away from Agra, rescued in Madhya Pradesh

ఇప్పటికే రెండు లెవెల్స్ పూర్తి చేసిన తర్వాత ఆ ఇద్దరు తర్వాతి లెవెల్‌లో ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేసేందుకు సిద్దపడ్డారు. ఇంటి నుండి పారిపోవడమే చివరి టాస్క్. ఇందు కోసం వారిద్దరూ తమ బ్యాగులు సర్ధుకొని ఉదయం ఎనిమిది గంటలకే పంజాబ్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు.

సెల్‌ఫోన్ ట్రేస్ చేయడానికి వీల్లేకుండా ఫోన్లు సిఛ్చాఫ్ చేశారు. స్కూల్ సమయం దాటినా పిల్లలద్దరూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే వీరిద్దరిలో ఓ బాలికర తన సోదరుడికి ఫోన్ ద్వారా అసలు విషయం చెప్పింది.

అయితే వెంటనే తర్వాతి స్టేషన్‌లో దిగిపోవాలని సోదరుడు సూచించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హూషంగబాద్ రైల్వేస్టేషన్‌లో దిగారు. ఇంతలో గమనించిన రైల్వే భద్రతా సిబ్బంది చైల్డ్ హెల్ప్ లైన్కు సమాచారం ఇచ్చారు.

శిశు సంరక్షణ కమిటీ సభ్యులు వచ్చి బాలికల నుండి సమాచారాన్ని సేకరించారు. తల్లిదండ్రుల సమక్షంలోనే వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్టు అధికారులు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two 14-year-old girls, who ran away from Agra in Uttar Pradesh while playing the Blue Whale Challenge game responsible for scores of deaths around the world, including India, were found on the railway station in Madhya Pradesh’s Hoshangabad district, officials have said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X