వందేళ్ల తర్వాత మహారాష్ట్ర తీరంలో కనిపించిన నీలి తిమింగలాలు

ముంబై: సుమారు వందేళ్ల తర్వత మహారాష్ట్ర సముద్ర తీరంలో నీలి తిమింగలం కనిపించింది. మార్చి నుంచి మే మధ్యలో సింధుదుర్గ్ తీరంలో ఓ తల్లి తిమింగలం తన పిల్ల తిమింగలంతో కలిసి కనిపించిందని ఓ పరిశోధకుల బంధం పేర్కొంది.

నాలుగు నీలి తిమింగలం పిల్లలను గుర్తించినట్లు ది కేటసీన్ పాపులేషన్ స్టడీ టీం కూడా తెలిపింది. మార్చి 28న తన పిల్ల తిమింగలంతో ఓ తల్లి తిమింగలాన్ని గుర్తించినట్లు తెలిపింది. కుంకేశ్వర్‌కు 2.7కిలోమీటర్ల దూరంలో, 16 మీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది.

blue whale

మహారాష్ట్ర మంగ్రోవ్ విభాగం అటవీ శాఖ అధికారి ఎన్ వాసుదేవన్ ఈ విషయంపై స్పందిస్తూ.. ప్రపంచంలోనే పెద్ద జంతువులైన నీలి తిమింగలాలను చివరిసారిగా 1914లో ఇక్కడ సముద్రంలో కనిపించినట్లు తెలిపారు.

కాగా, ఏప్రిల్, 11, 16, 30, మే 6 తేదీల్లో నాలుగు పిల్ల నీలి తిమింగలాలను సముద్రంలోపల 15మీటర్ల లోతులో గుర్తించినట్లు ఆ బృందం తెలిపింది. యునైటెడ్ నేషన్స్, డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్(ఎన్‌డిపి) ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ బృందం గత ఆరు నెలలుగా సింధుదుర్గ్ తీరంలో పరిశోధనలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+