Meerut Blue Drum Murder Case: బ్లూ డ్ర‌మ్ మ‌ర్డర్ కేసు.. భార్య‌, ఆమె ప్రియుడికి మ‌ర‌ణశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. భర్తను చంపి అతడి శవాన్ని డ్రమ్​ లో దాచిపెట్టిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మృతుడి భార్య, ఆమె ప్రియుడిని దోషులుగా తేల్చింది ఉత్తర్​ ప్రదేశ్ లోని మేరఠ్​ కోర్టు. అయితే తాజాగా ఈ కేసులో ఇద్దరు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ మేరకు జిల్లా కోర్టు జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా తీర్పు వెలువరించారు. ఈ కేసు విచారణ గత సెప్టెంబర్ 30న పూర్తి అయింది. ఈ కేసులో నిందితురాలు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా నేరానికి పాల్పడ్డట్లు తేలింది. దాంతో నిందితులు ఇద్దరికీ మరణశిక్ష విధిస్తూ మీరట్‌ కు చెందిన జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది.

అంతకుముందు జిల్లా జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా కోర్టులో బుధవారం శిక్షకు సంబంధించిన విచారణ జరిగింది. జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరైన ఇద్దరు దోషులను, శిక్ష ప్రకటించే ముందు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని కోర్టు అడిగారు.. అయితే తమకు చెప్పడానికి ఏమీ లేదని ఇద్దరూ బదులిచ్చారు. దాంతో కోర్టు తీర్పును వెలువరించింది. జైలు అధికారుల సమాచారం ప్రకారం.. తీర్పు చదువుతున్నప్పుడు ముస్కాన్ చేతులు జోడించి నమస్కారం పెట్టింది. తీర్పు అనంతరం ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ప్రియుడు సాహిల్ శుక్లా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఈ కేసులో నేరం యొక్క తీవ్రత, క్రూరత్వాన్ని ఉటంకిస్తూ.. ప్రాసిక్యూషన్ ఇద్దరికీ మరణశిక్ష విధించాలని కోరింది.

అసలేం జరిగింది..?

ఉత్తర్ ప్రదేశ్ లోని మేరఠ్ కు చెందిన మర్చంట్‌ నేవీ ఉద్యోగి సౌరభ్‌ రాజ్‌పుత్​ , ముస్కాన్​ రస్తోగీ లకు 2016 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే సౌరభ్‌ ఉద్యోగం వదిలిపెట్టడంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యయి. ఈ క్రమంలో సౌరభ్​ స్నేహితుడు సాహిల్‌ శుక్లాతో ముస్కాన్​ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి సౌరభ్‌ రాజ్‌పుత్​ ను చంపాలని కుట్ర పన్నారు. అలా భోజనంలో నిద్ర మాత్రలు కలిపింది. భర్త నిద్రలో జారుకున్నాక ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని 15 ముక్కలుగా కోసి ప్లాస్టిక్‌ డ్రమ్ములో వేసి సిమెంట్‌ తో కప్పిపెట్టింది. అనంతరం ప్రియుడితో కలిసి మనాలి పారిపోయింది.

BlueDrum Murder case latest news Court sentences victim s wife and her lover to death sentence now

అయితే సౌరభ్ కనపడకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సౌరభ్‌ భార్య ముస్కాన్‌ తో పాటు ఆమె ప్రియుడు సాహిల్‌ శుక్లాను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+