ఈ కార్పోరేషన్లు, మున్సిపాల్టీలకు ఇప్పుడు ఎన్నికలు లేనట్లే - నాలుగు రోజులే గడువు...!!

ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ముందుగా మున్సిపల్ పోల్ కు నోటిఫికేషన్ జారీ చేసారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటుగా మూడు విడతల్లో పంచాయితీ పోల్స్ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. షెడ్యూల్ విడుదల తో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా.. మున్సిపల్ పోల్స్ లో నాలుగు కార్పోరేషన్లు.. 23 మున్సిపాల్టీలకు షెడ్యూల్ విడుదల చేయలేదు. ఇక.. నామినేషన్లకు నాలుగు రోజులే గడువు విధించటం కీలకంగా మారుతోంది.

ఏపీలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఏపీలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 100 అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసారు. 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు, 10 నగర పంచాయితీలకు ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి. 30న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా, రాష్ట్రంలో మొత్తం 17 మున్సిపల్ కార్పోరేషన్లు... 123 మున్సిపాల్టీలు ఉండగా... ఇప్పుుడ 13 కార్పోరేషన్లు... 100 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగున్నాయి.

స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల- నామినేషన్లు, పోలింగ్, ఫలితాలు ఇలా...!!
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల- నామినేషన్లు, పోలింగ్, ఫలితాలు ఇలా...!!
AP State Election commission releases notification for Elections in 13 corporations and 100 municipalities

కోర్టు కేసుల కారణంగా మిగిలిన వాటిల్లో ఎన్నికల నిర్వహణ పెండింగ్ పెట్టినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మంగళగిరి- తాడేపల్లి, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం కార్పోరేషన్లకు ఎన్నికలు ఇప్పుడు జరగటం లేదు. అదే విధంగా మిగిలిన 23 మున్సిపాల్టీల్లోనూ కోర్టు కేసుల పరిష్కారం తరువాత ఎన్నికలు జరగనున్నాయి.

కాగా, మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 18వ తేదీ నామినేషన్లకు చివరి రోజుగా ప్రకటించారు. దీంతో, నాలుగు రోజుల సమయంలో అభ్యర్దుల ప్రకటన.. నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఇక.. ఈ గడువు పార్టీలు.. అభ్యర్దుల్లో టెన్షన్ పెంచుతోంది. ఈ నెల 28న ఒకే విడతలో మున్సిపల్ పోలింగ్... 30న ఫలితాలు వెల్లడించనున్నారు. అదే విధంగా జెడ్పీటీసీ- ఎంపీటీసీ, పంచాయితీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసారు.

స్థానిక ఎన్నికలపై సాయిరెడ్డి జోస్యం..! గెలిచేది వారే..! 2029లో మాత్రం..!
స్థానిక ఎన్నికలపై సాయిరెడ్డి జోస్యం..! గెలిచేది వారే..! 2029లో మాత్రం..!

నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. అదే విధంగా నవంబర్‌ 26న తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, నవంబర్‌ 29న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, డిసెంబర్‌ 2న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగుతాయి. అయితే, పోలింగ్‌ నాడే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో, ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+