రైలు ప్రయాణికులకు సుప్రీం గుడ్ న్యూస్..! ఆఫ్ లైన్ టికెట్లకూ ఇన్సూరెన్స్..!

దేశవ్యాప్తంగా రైలు ప్రయాణాలు చేసే వారిలో ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు చేస్తున్న వారితో పాటు ఆఫ్ లైన్ లో అంటే రైల్వే స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లలోనూ టికెట్లు తీసుకునే వారు ఉన్నారు. అయితే ఆన్ లైన్ లో టికెట్లు తీసుకునే వారికి మాత్రమే ఇన్సూరెన్స్ (Insurance) ను వర్తింపచేస్తున్న రైల్వే శాఖ.. నేరుగా స్టేషన్లలో తీసుకునే వారికి మాత్రం ఆ సదుపాయం కల్పించడం లేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు (Supreme Court) .. ఇవాళ రైల్వే బోర్డుకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

రైల్వే స్టేషన్లలోని కౌంటర్ల ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసే సాధారణ ప్రయాణికులకు కూడా తక్షణమే బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు రైల్వేను ఆదేశించింది. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకునే వారికి ప్రస్తుతం లభిస్తున్న ఇన్సూరెన్స్ రక్షణను .. అక్టోబర్ 27 నుంచి ఆఫ్‌లైన్ టిక్కెట్ దారులకు సైతం తప్పనిసరిగా వర్తింపజేయాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైతే, రైల్వే బోర్డుపై నేరుగా చట్టపరమైన చర్యలు ఉంటాయని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 2023 జూన్ లో జరిగిన ఒడిశా రైలు ప్రమాదం తర్వాత దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.

Supreme Court Mandates Insurance Cover for Railway Passengers Buying Tickets Offline From October 27

ఈ నేపథ్యంలో కౌంటర్లలో టిక్కెట్లు కొనుగోలు చేసే దిగువ మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన ప్రయాణికుల భద్రతను విస్మరించడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వర్గాలకు బీమా రక్షణ కల్పించేందుకు తగిన విధానాన్ని రూపొందించాలని గతంలోనే ఆదేశించినప్పటికీ, రైల్వే యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైల్వే శాఖ సుప్రీంకోర్టుకు ఇస్తున్న హామీలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని, క్షేత్రస్థాయిలో ఎటువంటి స్పష్టమైన మార్పులు కనిపించడం లేదని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రయాణికుల ప్రాణరక్షణ కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించినప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించడంలో అధికారులు విఫలమయ్యారని తప్పుబట్టింది. సాధారణ పౌరుల ప్రయాణ భద్రత వంటి అత్యంత కీలకమైన అంశంలో రైల్వే అధికారుల వైఖరి తీవ్ర నిరాశాజనకంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకు రైల్వే బోర్డు ఛైర్మన్, ఇతర సభ్యులను నేరుగా కోర్టుకు పిలిపించి విచారించాలని భావించినా, కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+