
శభాష్ ఉమెన్ వర్కర్.. జోరు వానలో విధి నిర్వహణ.. నెటిజన్ల ప్రశంసలు, ఆనంద్ మహీంద్ర కూడా
తౌక్తే తుపాన్ పెను ప్రభావం చూపించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రభావం ఎక్కువగానే ఉంది. మహా నగరం జలదిగ్బందంలో చిక్కుకుంది. అయితే ఓ పారిశుద్ద్య కార్మికురాలు మాత్రం తన విధులు నిర్వహించారు. జోరు వానలో.. మొక్కవోని ధైర్యంతో పనిచేశారు. ఆ వీడియో అలా.. అలా.. సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. అలా ఆనంద్ మహీంద్రా కూడా కొనియాడారు.
Recommended Video
జోరు వానలో విధులు..
తౌక్తే తుపాను ప్రభావంతో ముంబైలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ప్రచండ వేగంతో వీచిన గాలులు ప్రజలను వణికించాయి. చాలా ప్రాంతాల్లో వృక్షాలు నేలకొరిగాయి. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచించారు. కరోనా భయంతో జనం ఇంటికి పరిమితమయ్యారు. పరిస్థితి ఇలా ఉంటే ఓ మునిసిపల్ వర్కర్ మాత్రం తన విధి నిర్వహణలో రాజీ పడలేదు. వర్షం జోరున కురుస్తున్నా రోడ్లు ఊడ్చడంలో మునిగిపోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నో రెయిన్ కోట్..
వర్షం నుంచి రక్షించేందుకు రెయిన్ కోట్ లేకున్నా, తలకు ప్లాస్టిక్ కవరు చుట్టుకుని ఆమె రోడ్డు ఊడ్చడంలో నిమగ్నమైంది. ఆమె నిబద్ధతను చూసి పలువురు కొనియాడుతున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. ఈ రోజుకు ఇంతకుమించిన మోటివేషన్ లేదని అన్నారు. బీఎంసీ వారికి రెయిన్ కోట్‌లు అందివ్వాలని సూచించారు. వీరు కోవిడ్ వారియర్ల కంటే తక్కువేమీ కాదని మరికొందరు ప్రశంసించారు. వర్షాకాలం వస్తుండడంతో వారికి రెయిన్ కోట్లు ఇవ్వాలని చాలామంది నెటిజన్లు బీఎంసీకి సూచించారు.
శభాష్
పని
చేయమంటే
ఎగ్గొట్టే
వారు
చాలా
మంది.
ఇక
కరోనా
సమయంలో
చెప్పాల్సిన
పనిలేదు.
అయితే
ఆమె
పనిచేయడం
మాత్రం
అందరినీ
ఆశ్చర్యానికి
గురిచేసింది.
తనకెందుకులే
అని
ఆమె
ఇంట్లో
కూర్చొలేదు.
వానను
లెక్క
చేయకుండా..
తలపై
ప్లాస్టిక్
కవర్
పెట్టుకొని
మరీ
డ్యూటీ
చేశారు.
పని
తప్పించుకునే
వారికి
ఆదర్శంగా
నిలిచారు.
#mondaythoughts #MondayMotivation
— Mohd Abdul Sattar (@SattarFarooqui) May 17, 2021
Respect for these Municipal workers.. Such times make me realise how privileged I am.#MumbaiRains #CycloneTaukte #CycloneTauktae #Respect pic.twitter.com/XA64FTtqoe
#mondaythoughts #MondayMotivation
— Mohd Abdul Sattar (@SattarFarooqui) May 17, 2021
Respect for these Municipal workers.. Such times make me realise how privileged I am.#MumbaiRains #CycloneTaukte #CycloneTauktae #Respect pic.twitter.com/XA64FTtqoe
These bravehearts are nothing less than Covid warriors along with our HCW. Dear @mybmc - could we provide them protective gears/ Kit please. These are our frontline warriors on the ground, cleaning the streets in any adverse situation. Least we can do that for them. #CovidIndia https://t.co/wHCuzKySY9
— rahul shubham (@rahulshubham8) May 17, 2021