ఇంటి నుంచి పారిపోయి.. ఉద్యోగం దొరక్క.. బీచ్ లో ప్రేమజంట ఆత్మహత్య
పంజాబ్ రాష్ట్రంలోని హోషియాపూర్ జిల్లాకు చెందిన బల్జీత్‌సింగ్ (25) తన ప్రియురాలైన హరీందర్ కౌర్ (17)ను తీసుకొని గోవా రాష్ట్రంలోని పనాజీకి వచ్చి హోటల్ లో దిగాడు. ఈ ప్రేయసీప్రియులు కొన్నిరోజులు కొల్వా బీ
పనాజి : ఇంటి నుంచి గోవాకి పారిపోయిన ఓ ప్రేమజంట అక్కడ ఉద్యోగం కోసం తిరిగి తిరిగి, ఏ ఉద్యోగమూ లభించక, విసిగిపోయి చివరికి అక్కడి కొల్వా బీచ్‌లో ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది.
పంజాబ్ రాష్ట్రంలోని హోషియాపూర్ జిల్లాకు చెందిన బల్జీత్‌సింగ్ (25) తన ప్రియురాలైన హరీందర్ కౌర్ (17)ను తీసుకొని గోవా రాష్ట్రంలోని పనాజీకి వచ్చి హోటల్ లో దిగాడు.

ఈ ప్రేయసీప్రియులు కొన్నిరోజులు కొల్వా బీచ్‌లో తిరిగారు. ఆపై బల్జీత్‌సింగ్ తన ప్రియురాలైన హరీందర్ కౌర్ తో కలిసి బీచ్ లో ఉన్న కొబ్బరి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు ఇద్దరి మృతదేహాలను శవపరీక్ష్ అనంతరం వారి బంధువులకు అప్పగించారు. తమ కుమార్తె హరీందర్ కౌర్ ను బల్జీత్ సింగ్ కిడ్నాప్ చేశాడని ఆమె తల్లిదండ్రులు అంతకుమునుపే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఆత్మహత్యకు ముందు ప్రేమికులిద్దరూ ఉద్యోగం కోసం పలు హోటళ్లకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ప్రేమజంట ఆత్మహత్యకు దారితీసిన మరిన్ని కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications