దారుణం: స్కూల్ టాయ్‌లెట్‌లో రక్తపుమడుగులో విద్యార్థి మృతదేహం
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పాఠశాలలోని టాయిలెట్‌లో ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహానికి కత్తిపోట్లు ఉండటం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. వడోదరలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14ఏళ్ల కుర్రాడి మృతదేహం టాయిలెట్‌లో రక్తపు మడుగులో పడివుంది. బాలుడి శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి.

శుక్రవారం మధ్యాహ్నం రక్తపుమడుగులో ఉన్న బాలుడి మృతదేహాన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద లభించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం తెలిసే అవకాశం ఉంది. కాగా, ఈ ఘటన గత సంవత్సరం సంచలనం రేపిన గుర్గావ్‌లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన ప్రద్యుమన్ ఠాకూర్ హత్యకు గుర్తు తెచ్చేలా ఉంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications