లోక్ సభ ఉపఎన్నికల బరిలో శతృఘ్న సిన్హా-టీఎంసీ టికెట్ పై అసన్ సోల్ నుంచి పోటీ
ఒకప్పటి బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా ఈసారి పశ్చిమబెంగాల్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. బెంగాల్లోని అసన్ సోల్ లోక్ సభ స్ధానానికి త్వరలో జరిగే ఉపఎన్నికల్లో ఆయన్ను బరిలోకి దింపాలని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో బీజేపీకి గట్టి కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది.
మాజీ కేంద్ర మంత్రి, నటుడు శతృఘ్న సిన్హా పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేయనున్నారు.ఈ విషయాన్ని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ ట్విట్టర్‌లో ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు శ్రీ శత్రుఘ్న సిన్హా అసన్సోల్ నుండి లోక్‌సభ ఉప ఎన్నికలో మా అభ్యర్థిగా ఉంటారని అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రకటించడం సంతోషంగా ఉంది" అని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని బల్లిగంజ్ విధానసభ స్థానానికి ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు, టీఎంసీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి, గాయకుడు బాబుల్ సుప్రియోను ఆ పార్టీ నామినేట్ చేసింది. మమతా బెనర్జీ మరో ట్వీట్ లో మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ గాయకుడు బాబుల్ సుప్రియో బల్లిగంజ్ నుంచి విధానసభ ఉప ఎన్నికలో మా అభ్యర్థిగా ఉంటారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో వీరిద్దరినీ గెలిపించుకోవడం టీఎంసీకి పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యట్రిక్ సాధించి ఊపుమీదున్న టీఎంసీ.. బీజేపీని దెబ్బకొట్టేందుకు ఇది మరో అవకాశంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications