Audi car: శిల్పా శెట్టి మొగుడికే సినిమా చూపించాడు, హిట్ అండ్ రన్, కారు సీజ్, ఏం జరిగింది ?
బెంగళూరు/ ముంబాయి: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మొగుడికి ఓ వ్యక్తి సినిమా చూపించాడు. బెంగళూరులో ప్రమాదానికి కారణం అయిన కారు కేసు విచారణ చేసిన పోలీసులు సీసీటీవీ పుటేజీలు పరిశీలించి విచారణ చేశారు. ప్రమాదానికి కారణం అయిన Audi car R8 కారు ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాది అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. కారు నడిపింది శిల్పా శెట్టినా ? లేక ఆమె భర్త రాజ్ కుంద్రా నా ? అంటూ పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణతో విషయం తెలుసుకున్న శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మైండ్ బ్లాక్ అయ్యి ఎంత పని చేశావురా ? అంటూ తల పట్టుకున్నారు.

ఎయిర్ లైన్స్ హోటల్
బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్ లైన్స్ హోటల్ దగ్గర ఓ కారు ఆటో, బైక్ ను ఢీకొనడంతో (హిట్ అండ్ రన్) రచ్చరచ్చ అయ్యింది. ప్రమాదానికి కారణం అయిన డ్రైవర్ అక్కడి నుంచి పరారైనాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్. బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలు కావడంతో కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.

శిల్పా శెట్టి భర్త కారు
ప్రమాదానికి కారణం అయిన కారు వివరాలు సేకరించడానికి పోలీసులు ఎయిర్ లైన్స్ హోటల్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీలు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదానికి కారణం అయిన Audi R8 కారు నెంబర్ ఆధారం దర్యాప్తు చేసిన పోలీసులు ఆ కారు ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పేరు మీద రిజిస్టర్ అయ్యిందని గుర్తించారు.

సార్.... అసలు ఏం జరిగిందంటే ?
బెంగళూరు కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. బెంగళూరుకు శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా వచ్చారా ? అని ఆరా తీశారు. కారు నడిపింది శిల్పా శెట్టినా ? లేక ఆమె భర్త రాజ్ కుంద్రానా ? అంటూ ఆరా తీశారు. ముంబాయిలో నివాసం ఉంటున్న శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాతో మాట్లాడిన పోలీసులు విషయం తెలుసుకున్నారు. సార్ అసలు ఏం జరిగిందంటే అంటూ రాజ్ కుంద్రా ఓ స్టోరీ చెప్పాడు.

నాలుగు నెలల క్రితం
ముంబాయికి చెందిన ఓ కారు డీలర్ ద్వారా బెంగళూరులోని ఓ వ్యక్తికి నాలుగు నెలల క్రితమే తన ఆడి కారు R8 విక్రయించానని రాజ్ కుంద్రా బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బెంగళూరులోని బీటీఎం లేఔట్ 2వ స్టేజ్ నివాసి మోహమ్మద్ సద్దాం అనే వ్యక్తి రాజ్ కుంద్రా కారును కొనుగోలు చేశాడని పోలీసులు వివరాలు సేకరించారు.

అవును సార్.... అది నేనే
బెంగళూరులోని బీటీఎం లేఔట్ 2వ స్టేజ్ నివాసి మోహమ్మద్ సద్దాం కబ్బన్ పార్క్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆ రోజు ఎయిర్ లైన్స్ హోటల్ సమీపంలో కారు నడిపింది తానే అని, ప్రమాదానికి తానే కారణం అని మోహమ్మద్ సద్దాం అంగీకరించాడని పోలీసులు అన్నారు. పోలీసులు మోహమ్మద్ సద్దాంను అదుపులోకి తీసుకున్నారు.

మా నాయనే... ఎంతపని చేశావురా ?
నాలుగు నెలల క్రితం కొనుగోలు చేసిన ఆడి కారును అతని పేరుతో రిజిస్టర్ చేసుకోకుండా బెంగళూరులో సంచరిస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పేరుతో ఉన్న ఆడి కారును పోలీసులు సీజ్ చేశారు. కారు రాజ్ కుంద్రా పేరుతోనే ఉండటంతో ఆ మహానుభావుడు చేసిన పనికి ఇప్పుడు శిల్నా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు తలలు పట్టుకుని పోలీసులతో సంప్రధింపులు జరుపుతున్నాడని తెలిసింది.












Click it and Unblock the Notifications