Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kangana: సీఎం ముద్దుల కొడుకుతో డ్రగ్ మాఫియాకు లింక్, సోనియా సేన గేమ్స్, బీజేపీ ఉంటే, SSR కేసు !

ముంబాయి/ న్యూఢిల్లీ/ జైపూర్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు, డ్రగ్స్ మాఫియా కేసు విషయాల్లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ Kangana Ranaut ఇప్పుడు ఆమె భాణం సీఎం కొడుకు మీద పెట్టింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ముద్దుల కొడుకు ఆదిత్య ఠాక్రేకి డ్రగ్స్ మాఫియాతో లింక్ లు ఉన్నాయని, ఆ విషయంపై విచారణ జరిపించే దమ్ము ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా ? అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండుంటే ఆ సీన్ వేరుగా ఉండేదని, అందరి బండారం బట్టబయలు అయ్యేదని, వాళ్లకు అసలైన సినిమా కనపడి ఉండేదని నటి కంగనా రనౌత్ శివసేన, కాంగ్రెస్ పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో సోనియా సేన ఉందని కంగనా సెటైర్లు వేస్తున్నారు.

 మూవీ మాఫియా, సుశాంత్ సింగ్ కేసు

మూవీ మాఫియా, సుశాంత్ సింగ్ కేసు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR)అనుమానాస్పద మృతి కేసు, బాలీవుడ్ మాఫియా, ముంబాయి డ్రగ్స్ మాఫియా కేసు విషయాల్లో నేను బహిరంగంగా నిజాలు మాట్లాడటం శివసేన నాయకులకు మింగుడుపడటం లేదని నటి కంగనా రనౌత్ ఆరోపించారు. సుశాంత్ సింగ్ ఎలా మరణించాడు ? అనే విషయం బయటకు రావాలని డిమాండ్ చేస్తున్న తన మీద మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష కడుతోందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆరోపించారు.

 సీఎం ముద్దుల కొడుకు ఆదిత్యకు లింక్

సీఎం ముద్దుల కొడుకు ఆదిత్యకు లింక్

బాలీవుడ్ మూవీ మాఫియా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, డ్రగ్స్ మాఫియా గురించి నేను మాట్లాడటం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే జీర్ణించుకోలేకపోతున్నారని నటి కంగనా రనౌత్ మండిపడ్డారు. ఎందుకంటే సీఎం ఉద్దవ్ ఠాక్రే ముద్దుల కొడుకు ఆదిత్య ఠాక్రేకి డ్రగ్స్ మాఫియాతో లింక్ లు ఉన్నాయని, ఆ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అనే భయం సీఎంకు పట్టుకుందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 ఎవరి సత్తా ఏమిటో చూసుకుందాం

ఎవరి సత్తా ఏమిటో చూసుకుందాం

మహారాష్ట్ర ప్రభుత్వం మీద, శివసేన నాయకుల మీద తాను విమర్శలు చేస్తున్నందువలన తనకు అనేక ఇబ్బందులు పెడుతున్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించారు. అయితే ఈ పోరాటంలో తాను ఒంటరి మహిళ, వారి చేతిలో ప్రభుత్వం ఉంది, అయినా తాను భయపడనని, ఎవరు ఎవరికి ఇబ్బందులు పెడుతున్నారో అనే విషయం ప్రజలు చూస్తున్నారు, చూద్దాం ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్విట్ చేశారు.

 బీజేపీ ప్రభుత్వుం ఉంటే ఆ కిక్కే వేరు

బీజేపీ ప్రభుత్వుం ఉంటే ఆ కిక్కే వేరు

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం (BJP) అధికారంలో ఉండుంటే ఆ కథ వేరుగా ఉండేదని, బాలీవుడ్ మూవీ మాఫియా, డ్రగ్స్ మాఫియా ముఠాలకు కంటిమీద కనుకులేకుండా పోయేదని నటి కంగనా రనౌత్ అన్నారు. అంతేకాకుండా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు చేధించే విషయంలో ముంబాయి పోలీసులు చక్కగా పనిచేసే వాళ్లని, అయితే ఇప్పుడు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉండటంతో ముంబాయి పోలీసులు వాళ్లపని వాళ్లు చెయ్యలేకపోతున్నారని నటి కంగనా రనౌత్ ఆరోపించారు.

Recommended Video

    COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
     ఇది సోనియా సేన... కంగనా సెటైర్లు

    ఇది సోనియా సేన... కంగనా సెటైర్లు

    మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఎవరు ఎవరిమాట వినాలో వాళ్లకే అర్థం కావడం లేదని కంగనా రనౌత్ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో సోనియా సేన (సోనియా గాంధీ) సేన అధికారంలో ఉందని, అందుకే ఎవరిపని వాళ్లు చెయ్యలేకపోతున్నారని మరోసారి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని టార్గెట్ చేసుకుని నటి కంగనా రనౌత్ సెటైర్లు వేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+