సీఎం ఇంట్లో బాలీవుడ్ స్టార్స్ సందడి.. ఎందుకంటే!!
గణేశ నవరాత్రి వేడుకలలో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. వినాయక నవరాత్రి వేడుకలు ప్రారంభమైన నాటి నుంచి సినీ రంగానికి చెందిన ప్రముఖులు, దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు నిర్వహించే గణేశ నవరాత్రి వేడుకలలో పాల్గొంటూ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మొన్నటికి మొన్న ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన గణేశ నవరాత్రి వేడుకలకు బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతులు నిర్వహించిన పూజా కార్యక్రమాలలో పాల్గొని, గణేశ హారతి నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, భార్య గౌరీ ఖాన్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, రితేష్ దేశ్ ముఖ్, జెనిలియా దేశముఖ్, ఫ్యాషన్ డిజైనర్ మరియు స్టైలిస్ట్ మనీష్ మల్హోత్రా, నటి రేఖ తదితరులు హాజరయ్యారు. అంతేకాదు ఎంఎంఎస్ నాయకుడు రాజ్ ఠాక్రే మరియు ఆయన భార్య షర్మిల ఠాక్రే తో కలిసి హాజరయ్యారు. రష్మిక మందన్నా తదితరులు ముఖేష్ అంబానీ ఇంట సందడి చేశారు.
ఇక తాజాగా మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే వినాయక నవరాత్రుల సందర్భంగా తన నివాసంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలలోనూ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలోను బాలీవుడ్ సెలబ్రిటీలు వినాయకుని పూజించారు. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే ఇంట్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో బాలీవుడ్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, జాకీష్రాఫ్, భూషణ్ కుమార్, షెహనాజ్ గిల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అర్పిత ఖాన్ , బావ అయుష్ శర్మలతో కలిసి పాల్గొన్నారు. గాయని ఆశాభోంస్లే మనవరాలు జానాయ్ భోంస్లే కూడా దర్శనానికి హాజరయ్యారు. బోనీకపూర్, రాజ్ కుమార్ హిరానీ తదితరులు హాజరయ్యారు. గణేష పూజతో ఏకనాథ్ షిండే ఇంట్లో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఆయన ఆహ్వానం మేరకు ప్రతి ఒక్కరు హాజరై గణేశ పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications