శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు: ఆగిన రైళ్లు

న్యూఢిల్లీ: ఢిల్లీ - కాన్పూర్‌ రైలులో బాంబు ఉందన్న సమాచారంతో పోలీసులు ఆదివారం నాడు తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ - కాన్పూర్‌ రైలులో బాంబు ఉందని మహారాష్ట్ర రాజధాని ముంబై ఏటీఎస్‌ పోలీసులకు ఈ మెయిల్‌ వచ్చింది.

ముంబై ఏటీఎస్‌ పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ-లక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఘజియాబాద్‌లో నిలిపివేసి డాగ్‌ స్క్వాడ్‌తో క్షుణ్నంగా తనిఖీ చేశారు.

Bomb Scare On Lucknow Shatabdi Express Delayed Trains In Delhi

రైలులో బాంబులేదని నిర్ధారించిన అనంతరం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను పంపించారు. కాగా, పోలీసుల తనిఖీల వల్ల పలు రైళ్లు ఉత్తరాదిన ఆలస్యంగా నడిచాయి. అహ్మదాబాద్, కోల్‌కతా తదితర ప్రాంతాల నుంచి బలుదేరాల్సిన రైళ్లలో కూడా సోదాలు నిర్వహించారు.

బీజాపూర్‌ జిల్లాలో ముగ్గురు యువకుల అపహరణ

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని బార్కగూడలో ముగ్గురు యువకులు అపహరణకు గురైన ఘటన కలకలం సృష్టించింది. పుణె నుంచి వచ్చిన యువకులను మావోయిస్టులు అపహరించారు. గడ్చిరోలి నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి వరకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించాలని యువకులు తలపెట్టగా మార్గ మధ్యంలో ఈ ఘటన జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+