హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎయిర్ పోర్టులో బాంబు, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, హై అలర్ట్, హైదరాబాద్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పేలుతుందని బెదిరింపులు రాడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నై వస్తున్న సమయంలో బాంబు బెదిరింపు కలకలంరేపింది.

హైదరాబాద్ టూ చెన్నై

హైదరాబాద్ టూ చెన్నై

హైదారాబాద్ నుంచి చెన్నై వస్తున్న విమానంలో బాటిల్ బాంబు ఉందని, విమానం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాగానే పేలి పోతుందని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులను బెదిరించాడు.

ప్రతి రోజు 22 విమానాలు

ప్రతి రోజు 22 విమానాలు

హైదరాబాద్-చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య ప్రతిరోజూ దాదాపు 22 విమాన సర్వీసులు సంచరిస్తున్నాయి. అయితే ఏ విమానంలో బాటిల్ బాంబు ఉంది అనే విషయం గుర్తు తెలియని వ్యక్తి చెప్పకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్

వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్


శుక్రవారం ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నై చేరుకుంటున్నారు. ఈ సందర్బంలో ఎయిర్ పోర్టు దగ్గర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో బాటిల్ బాంబు బెదిరింపు రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.

ఎయిర్ పోర్టులో హై అలర్ట్

ఎయిర్ పోర్టులో హై అలర్ట్


చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి చెన్నై వస్తున్న ప్రతి విమానం పరిశీలిస్తున్నారు. లగేజ్ లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానంగా ప్రవర్థించే వారిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఫోన్ ఎక్కడి నుంచి !

ఫోన్ ఎక్కడి నుంచి !


బాంబు బెదిరింపు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎయిర్ పోర్టు దగ్గర పోలీసులు భద్రత మరింతపెంచారు. ఎయిర్ పోర్టు దగ్గరకు వస్తున్న అన్ని వాహనాలను కిలోమీటరు దూరంలోనే పరిశీలించి పింపిస్తున్నారు.

English summary
Security personnel at the Chennai airport are on their toes, following a threat that there is a bomb inside a bottle onboard a flight coming to the city from Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X