పేల్చేస్తాం: జయలలిత ఇంటికి బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటిని పేల్చేస్తామంటూ సోమవారం బెదిరింపులు వచ్చాయి. చెన్నై సిటీ పోలీస్ కంట్రోల్ రూంకి ఓ ఆగంతకుడు ఫోన్ చేసి పొయెస్ గార్డెన్‌లోని జయలలిత ఇంటిని పేల్చేస్తామని బెదిరించాడు.
తక్షణమే పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ ఫోన్‌కాల్ విల్లుపురం జిల్లాలోని మరకణ్ణం ప్రాంతం నుంచి వచ్చినట్లు తెలిసింది. పోలీసు బృందాలు మరకణ్ణంకి చేరుకుని ఆగంతకుడి కోసం గాలింపు చేపట్టగా ఫోన్‌కాల్ చేసింది 14 ఏళ్ల భువనేశ్వరన్ అనే బాలుడని తెలిసింది.

దీంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపు కాల్ ఎందుకు చేశాడనేదానిపై పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు. బాంబు బెదిరింపులు అబద్ధమని తెలిసినా పోలీసులు జయలలిత ఇంటి చుట్టూ భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications