ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు..
ఇటీవల విమానాలకు బాంబ్ బెదిరింపు కాల్స్, మెసెజ్‌లు ఎక్కువపోయాయి. అధికారులు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకున్న ఇలాంటి కాల్స్ తరచుగా రావడం చూస్తునే ఉన్నాం. అయితే, తాజాగా మరోసారి ఎయిర్ఇండియా విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. ఎయిర్‌పోర్టుకు సరైన సమయంలో చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడు ఎలాగైన విమానాన్ని ఎక్కాలనే నెపంతో ఫ్లైట్‌లో బాంబు పెట్టానంటూ బెదిరించిన ఘటన మంగళవారం విశాఖ విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేపింది.
పూర్తి వివరాల మేరకు.. దేశ రాజధాని ఢీల్లీ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎయిరిండియా విమానం మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరింది. అయితే, అందులో ఎక్కాల్సిన ఒక ప్రయాణికుడు సమయానికి ఎయిర్‌పోర్టుకు చేరుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా ఫ్లైట్‌ను ఎక్కాలన్న ఉద్దేశంతో ఆ విమానంలో బాంబు ఉందంటూ విమాన సిబ్బందికి కాల్ చేసి బెదిరించాడు. అయితే అప్పటికే బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం విశాఖ ఎయిర్‌పోర్టుకు రాత్రి 08.15 గంటలకు చేరుకుంది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు 8.19 గంటలకు అధికారులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే విశాఖ విమానాశ్రయం అధికారులు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రయాణికులను, వారి వెంట తెచ్చుకున్న లగేజీని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత వారందరినీ బయటకు పంపారు. అనంతరం భద్రతా సిబ్బంది అధికారుల సూచనతో నిబంధనలను అనుసరించి ఫ్లైట్‌ను పూర్తిగా తనిఖీ చేసి ఎటువంటి అపాయం లేదని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి ఢిల్లీకి పంపించేందుకు అనుమతించారు. ఈ నేపథ్యంలో రాత్రి 8.55 గంటల సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరాల్సిన విమానం రాత్రి 11.45 గంటల వరకూ విశాఖ ఎయిరపోర్టులోనే ఉండిపోయింది. ఆ ఫ్లైట్ రాత్రి 12.30 గంటలకు బయలుదేరే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా తప్పుడు సమాచారం ఇచ్చిన ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రయాణికుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications