వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ కోరిక లేకుండా అమ్మాయిని తాకితే లైంగిక వేధింపు కాదు: పోక్సో చట్టంపై జస్టిస్ భారతి సంచలనం

|
Google Oneindia TeluguNews

అప్పుడే పుట్టిన పసి పాప దగ్గర్నుంచి పండు ముసలి దాకా మృగాళ్ల లైంగిక అకృత్యాలకు బలైపోతున్న ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం. దేశంలో చిన్నారులపై(మైనర్లపై) లైంగిక దాడులు, వేధింపులను నిరోధించే ఉద్దేశంతో ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్(పోక్సో) యాక్ట్ అమలవుతోన్న దరిమిలా తరచూ దానిపై వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా పోక్సో చట్టానికి సంబంధించిన ఓ కేసులో బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ భారతి డాంగ్రే సంచలన ఆదేశాలిచ్చారు. వివరాల్లోకి వెళితే..

year ender 2020: సెక్స్ కలాపాలు -పట్టపగలే జోరుగా రతిక్రీడ -కండోమ్స్ వాడకంలో హైదరాబాద్ టాప్year ender 2020: సెక్స్ కలాపాలు -పట్టపగలే జోరుగా రతిక్రీడ -కండోమ్స్ వాడకంలో హైదరాబాద్ టాప్

 17 ఏళ్ల అమ్మాయిని 27ఏళ్ల యువకుడు..

17 ఏళ్ల అమ్మాయిని 27ఏళ్ల యువకుడు..

మహారాష్ట్రలోని పుణె జిల్లా బారామతికి చెందిన ఓ 27 ఏళ్ల యువకుడు తమ వీధిలోనే నివసించే 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. ఒక రోజు ఆమె ట్యూషన్‌కు వెళ్తుండగా అడ్డుకుని చేయి పట్టుకుని తన ప్రేమను వ్యక్తం చేశాడు. భయపడిన ఆమె అందుకు నిరాకరించి అతడి నుంచి విడిపించుకుని వెళ్లిపోయింది. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. మొబైల్‌ నుంచి బెదిరింపు మెసేజ్‌లు పంపాడు. అంతేకాదు..

బాలిక పేరుతో ఖాతా తెరిచి..

బాలిక పేరుతో ఖాతా తెరిచి..

తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఆ యువకుడు.. బాలిక పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి కొందరు స్నేహితులతో ఆమె చేస్తున్నట్లుగానే అసభ్యకరంగా చాటింగ్ చేశాడు. ప్రతినిత్యం ఆమె ఇంటి వద్ద నిలబడి ఫోన్లోమెసేజ్‌లు పంపేవాడు. తన కూతురిని పోకిరి వెధవ ఫాలో అవుతున్నట్లు గుర్తించిన బాలిక తండ్రి.. ఆ యువకుడిని మందలించాడు. కానీ..

 తండ్రిని కూడా బెదిరించి..

తండ్రిని కూడా బెదిరించి..

తన కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రిని కూడా ఆ యువకుడు బెదిరించాడు. మళ్లీ మళ్లీ అదే పనిగా ఆమె ఇంటి ముందు తచ్చాడటం, ఫోన్లకు మెసేజ్ లు పంపడంలాంటివి చేశాడు. ఇలా ఎనిమిది నెలలపాటు నిత్య నరకం అనుభవించిన ఆ బాలిక.. చివరికి తల్లిదండ్రుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఐపీసీ సెక్షన్లతోపాటు బాలిక మైనర్‌ కావడంతో పోక్సో చట్టంలోని లైంగిక దాడి, స్పర్శకు సంబంధించిన సెక్షన్ల ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు అయింది. కానీ..

సెక్స్ కాదు.. ప్రేమ కోసమట..

సెక్స్ కాదు.. ప్రేమ కోసమట..

బాలికను వేధించిన కేసులో నిందితుడిపై రెండు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో అతని బెయిల్‌ పిటిషన్‌ను కింది కోర్టు తిరస్కరించింది. దీనిపై అతడు బాంబే హైకోర్టును ఆశ్రయించగా, అనుకూల ఆదేశాలు రావడం గమనార్హం. నిందితుడైన యువకుడు లైంగిక ఉద్దేశంతోకాకుండా తన ప్రేమను వ్యక్తం చేసేందుకే అమ్మాయి చేతిని చేతిని పట్టుకున్నాడని, పోక్సో సెక్షన్‌ 8కి సంబంధించిన లైంగిక వేధింపు కాదని అతడి తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవిస్తూ.. లైంగిక ఉద్దేశం లేని స్పర్శ.. లైంగిక వేధింపు కాదని, ఇది పోక్సో చట్టం కిందకు రాదని హైకోర్టు జడ్జి జస్టిస్ భారతి డాంగ్రే పేర్కొన్నారు. అంతేకాదు, సదరు యువకుడికి బెయిల్‌ కూడా మంజూరు చేశారు. మహిళలకు రక్షణగా ఉండాల్సిన చట్టాలు సరిగా అమలు కావట్లేదన్న ఆరోపణల నడుమ పోక్సో చట్టంపై బాంబే హైకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Recommended Video

ap high court stay On intermediate online admissions

షాకింగ్: పతనం దిశగా బీహార్ సర్కార్ -సీఎం పదవి వద్దన్న నితీశ్ -బీజేపీ గూటికి జేడీయూ ఎమ్మెల్యేలు -కలకలంషాకింగ్: పతనం దిశగా బీహార్ సర్కార్ -సీఎం పదవి వద్దన్న నితీశ్ -బీజేపీ గూటికి జేడీయూ ఎమ్మెల్యేలు -కలకలం

English summary
Any physical touch inadvertently or without any sexual intent is not a sexual assault under the Protection of Children from Sexual Offences (POCSO) Act. Justice Bharati Dangre of the Bombay High Court ruled this while granting anticipatory bail recently to a 27-year-old man from Baramati, who was accused of sexual assault on a minor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X