వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టులో ఊరట: మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం ఎత్తివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: నెస్లే ఇండియాకు చెందిన మ్యాగీ పైన మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం నాడు ఎత్తివేసింది. మ్యాగీ నూడిల్స్‌ నమూనాలను మరోసారి పరీక్షించాలని బాంబే హైకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది.

మ్యాగీ నూడిల్స్‌లో హానికర పదర్ధాలున్నాయంటూ మహారాష్ట్ర ప్రభుత్వం మ్యాగీపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీని పైన మ్యాగీ హైకోర్టుకు వెళ్లింది.

ప్రస్తుతానికి నిషేధాన్ని ఎత్తివేసిన బాంబే హైకోర్టు... మరోసారీ నూడుల్స్ నమూనాలపై పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

Bombay High Court lifts nationwide ban on Maggi

ఈ కేసులో పిటిషనర్ భద్రపరచిన నూడల్స్ నమూనాలపై పరీక్షలు జరపాలని స్పష్టం చేసింది. మ్యాగీ నూడుల్స్ హానికరం అంటూ జూన్‌‍లో ఆహార భద్రత నియంత్రణ సంస్థ నిషేధించిన సంగతి తెలిసిందే. దాంతో పలు దుకాణాల్లో అప్పటికే ఉన్న మ్యాగీ నూడుల్స్ స్టాక్‌ను వెనక్కి తీసుకున్నారు.

దాంతో నెస్లే బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తాజా ఉత్పత్తులను మరోసారి పరీక్షించి పంపాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి బ్యాచులో ఐదేసి శాంపిల్స్‌ను మూడు ల్యాబ్‌లకు పంపించి పరీక్షించాలని, ఆరువారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

English summary
In a big relief to Nestle India, Bombay high court on Thursday set aside the order passed by FSSAI, banning 9 variants of the popular noodle Maggi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X