వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌ టెల్‌ నుంచి బంపర్‌ ఆఫర్: ఉచితంగా 1000 జీబీ డేటా

భారతి ఎయిర్‌ టెల్ మొబైల్ డేటా వినియోగదారుల కోసం మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఎంపిక చేసిన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌ పై 1000 జీబీ ని ఉచితంగా అందిస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: భారతి ఎయిర్‌ టెల్ మొబైల్ డేటా వినియోగదారుల కోసం మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఎయిర్‌ టెల్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ కస్టమర్లకు అదనపు డేటా ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎంపిక చేసిన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌లో అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. 1000 జీబీ ని ఉచితంగా అందిస్తోంది. ఏప్రిల్‌ 16 తరువాతి ఖాతాదారులకు, ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అనుభవిస్తున్న కస్టమర్లు ఈ బోనస్‌ డేటాను పొందవచ్చు. ఈ 'బోనస్' ఆఫర్ ఎయిర్ టెల్ వెబ్ పోర్టల్‌లో యాక్టివ్‌ గా ఉంది.

ఉదాహరణకు, ఢిల్లీలో రూ .899 ప్లాన్ 30 జీబీకి బదులుగా ప్రస్తుతం 60 జీబీ వేగవంతమైన డేటాను అందిస్తోంది. రూ 1099 ప్లాన్‌లో ఇపుడు 90 జీబీ (గతంలో 50 జీబీ) ఆఫర్‌ చేస్తోంది. రూ .1299 ప్లాన్ లో 125 జీబీ (గతంలో 75 జీబీ) ఆఫర్‌ చేస్తోంది. రూ .1499 ప్లాన్ గతంలో 100 జీబీ డేటాతో పోలిస్తే 160 జీబీ అందిస్తోంది.

Bonus data offer: Bharti Airtel gives 1000 GB extra on select broadband plans

ఈ భారీ ప్రయోజనాలను దాదాపు అన్ని నగరాల్లో ఎయిర్ టెల్ అందుబాటులో ఉంచింది. వెబ్‌సైట్‌ ప్రకారం రూ.899 ప్లాన్‌ తరవాతి ప్లాన్‌లలో 1000 జీబీ ఉచితం. అలాగే ఈ ప్లాన్స్‌ అన్నింటిలోనూ అన్‌లిమిటెడ్‌ లోకల్‌ అండ్‌ ఎస్టీడీ కాల్స్ ఉచితం.

గత వారం, కంపెనీ తన బ్రాడ్‌ బ్యాండ్‌ ప్రణాళికలను రిఫ్రెష్ చేసింది. కొత్త ప్రణాళికల్లో ఎయిర్ టెల్ హోమ్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు 100 శాతం అదనపు డేటాను అందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
India’s telecom major, Bharti Airtel has started offering 1,000 GB extra on select broadband plans to its customers. The ‘Bonus’ offer can be availed by new and existing customers who enrolled for Airtel broadband services on or after 16 May, a report by Business Standard said on Friday. Airtel had tweaked its home broadband plans to include 100% more data with no increase in monthly rentals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X