రైల్వే ఉద్యోగులకు బోనస్, 5 బాషలకు ప్రాచీన హోదా: కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించడంతోపాటు 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్-ఆయిల్ సీడ్స్'కు ఆమోదం తెలిపింది. అంతేగాక, దేశంలో మరాఠీ సహా ఐదు భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ఈ నేపథ్యంలో మరాఠీ, పాళి, ప్రాకృతం, అస్సామీ, బెంగాళీ భాషలకు ప్రాచీన హోదా దక్కనుంది. ఇప్పటికే తెలుగు సహా ఆరు భాషలకు ప్రాచీన హోదా ఉన్న విషయంతెలిసిందే.

Bonus for railway employees ancient status for 5 languages To be decided by Union Cabinet

రైల్వే ఉద్యోగులకు బోనస్‌

దసరా సహా పలు పండగల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు బోనస్‌ చెల్లించేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్‌గా రూ.2028.57 కోట్లు చెల్లించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు తెలిపారు.

వ్యవసాయ సంబంధిత పథకాలన్నింటినీ ఒకే గోడకు కిందకు తీసుకొచ్చేలా రెండు ప్రత్యేక స్కీంలను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (PM RMKY), కృషోన్నతి యోజన పథకాల ద్వారా సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రతకు సంబంధించి రూ. లక్ష కోట్ల వ్యయంతో ఈ రెండు స్కీంలను అమలు చేయనుంది.

రాబోయే ఆరేళ్లలో నూనె గింజల ఉత్పత్తికి రూ. 10,103 కోట్ల ఖర్చు చేయనుంది. వంట నూనె దిగుమతులపై స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా మోడీ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. వంట నూనెలు దేశ వార్షిక అవసరాల్లో 50 శాతానికి పైగా భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళిక రూపొందించింది. 2022-23 నాటికి 39 మిలియన్ టన్నుల నూనెగింజలను దేశంలో ఉత్పత్తి చేస్తుండగా.. 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, సాగును అదనంగా 40 లక్షల హెల్త్ కార్డులు పెంచేందుకు లక్ష్యాన్ని నిర్ధించుకుంది.

మరోవైపు, చెన్నై మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండో దశకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ట్రాఫిక్‌ను సులభతరం చేసి, ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఫేజ్‌-2లో భాగంగా రూ.63,246 కోట్లతో 119 కి.మీల మేర ఈ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు కింద మూడు కారిడార్లుగా మొత్తం 120 స్టేషన్లు నిర్మించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+