కాంగ్రెస్ సీఎం అభ్యర్ధుల్నీ వదలని ఓటర్లు-హరీష్ రావత్, చరణ్ జీత్ చన్నీ ఘోర పరాజయాలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీపై ఓటర్ల ఆగ్రహం స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ తో పాటు విపక్షంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ ఓటర్లు తమ తీర్పును ఫుల్ క్లారిటీతో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్ , ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఏకంగా ఆ పార్టీకి చెందిన సీఎం అభ్యర్ధుల్ని సైతం ఓటర్లు మట్టికరపించారు.
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీఎంగా ఉంటూ మరోసారి ఎన్నికల్లో పోటీ చేసిన చరణ్ జీత్ సింగ్ చన్నీ.. తాను పోటీ పడిన రెండు నియోజకవర్గాలు చమ్ కౌర్ సాహిబ్, బహదౌరిన్ రెండు నియోజకవర్గాల నుంచి ఓటమిపాలయ్యారు. ఆమె ఆద్మీ పార్టీ కి చెందిన లాబ్ సింగ్ ఉగోకే అనే ఓ మొబైల్ ఫోన్ మెకానిక్ చన్నీని బహదౌరిన్ లో 27 వేల ఓట్ల భారీ తేడాతో ఓడించారు. మరో నియోజకవర్గం చమ్ కౌర్ సాహిబ్ లోనూ చన్నీకి దారుణ పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలతో సీఎం అభ్యర్ధిగా నిలబెట్టిన చన్నీ.. ఆ పార్టీ ఆశలన్నీ నీరుగార్చారు. సిద్దూ, చన్నీ వార్ వీరిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీ కొంపముంచింది.

ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుపుపై భారీ ఆశలే పెట్టుకుంది. ముఖ్యంగా రాజకీయ దిగ్గజం హరీష్ రావత్ ఈసారి కచ్చితంగా మ్యాజిక్ చేస్తారని అంతా ఆశించారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయన్ను కూడా తిరస్కరించారు. ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చిన బీజేపీకే మరోసారి పట్టం కట్టారు.
బీజేపీ హవాలో హరీష్ రావత్ వంటి రాజకీయ ఉద్దండుడు కూడా లాల్ కువాన్ నియోజకవర్గంలో 14 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ నీరుగారిపోయాయి. పొరుగున ఉన్న యూపీలో బీజేపీ హవా ప్రభావం ఉత్తరాఖండ్ పై పడటం వల్లే కాంగ్రెస్ కు ఇక్కడ దారుణ పరాజయం ఎదురైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications