వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హస్తినలో అర్ధరాత్రి హైటెన్షన్.. మహిళలపై బౌన్సర్ల దాడి.. కారణమిదే..?

|
Google Oneindia TeluguNews

వైన్ షాపులకు పట్టణం/ సిటీని బట్టి రాత్రి 10 నుంచి 11 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత మందు విక్రయించొద్దు. అలా చేస్తే చర్యలు ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి తర్వాత కూడా మద్యం విక్రయించారు. దీంతో మహిళలు ఆందోళనకు దిగారు. వైన్ షాపునకు వచ్చి మరీ నిరసనకు దిగారు. వైన్ షాపు సిబ్బంది కూడా ఆందోళనకు దిగారు.

అర్దరాత్రి హైడ్రామా

అర్దరాత్రి హైడ్రామా

ఢిల్లీలో గల వైన్‌ షాప్‌ వద్ద అర్ధరాత్రి కొందరు మహిళలు వచ్చారు. వైన్‌ షాపు మూసివేయాలని నినాదాలు చేశారు. మహిళలు, వైన్‌ షాపు సిబ్బంది మధ్య వాగ్వివాదం జరిగింది. వైన్ షాపులో ఉన్న మహిళా బౌన్సర్లు.. నిరసనకు దిగిన మహిళలపై దాడులకు దిగారు. దీంతో వారు కూడా ఎదురు దాడికి పాల్పడ్డారు. బౌన్సర్లు.. మహిళలను చితకబాదడంతో వారు గట్టిగా కేకలు వేశారు. ఢిల్లీలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది.

రంజిత్‌పై దాడి

రంజిత్‌పై దాడి

అక్కడ విధులు నిర‍్వహిస్తున్న దక్షిణ ఢిల్లీ తిగ్డి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రంజిత్ జోక్యం చేసుకుని వారికి నప్పజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ మహిళలు.. పోలీసులపై దాడి చేశారు. దీంతో అతడి డ్రెస్‌ చిరిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. వారిని చెదరగొట్టారు. 10 మందిని అరెస్ట్‌ చేశారు. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మహిళా బౌన్సర్లు

మహిళా బౌన్సర్లు

వైన్ షాపు మహిళా బౌన్సర్లు దాడి చేశారని మహిళలు వాపోతున్నారు. అర్ధరాత్రి వరకు వైన్స్ ఎందుకు ఓపెన్ చేసి ఉందని వారు అడుగుతున్నారు. సమాధానం లేదు.. కానీ తమపై తిరిగి దాడి చేశారని పేర్కొన్నారు. వీడియో మాత్రం ట్రోల్ అవుతుంది. అదేంటి.. మహిళలు మహిళలపై దాడి చేయడం ఏంటీ అని ఫైర్ అవుతున్నారు. యాజమాన్యానికి తొత్తుగా ఉండి.. మహిళలపై దాడి చేయడం సరికాదని అంటున్నారు.

English summary
bouncers are attacked to the woman at delhi due to wine shop open.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X