Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ భావోద్వేగ పోస్ట్.. మిస్ యూ పాపా అంటూ షేర్ చేసిన బౌలర్..

భారత క్రికెట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఆసియాకప్ లో రాణించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంకపై అద్భుత ప్రదర్శన చేశాడు. ఆరు వికెట్లు తీసి శ్రీలంకను కుప్పకూల్చాడు. మహ్మద్ సిరాజ్ ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో 694 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 9వ స్థానంలో అతను ఏకంగా 8 స్థానాలు ఎగబాకి మొదటి స్థానానికి వచ్చాడు. మహ్మద్ సిరాజ్ వన్డే బౌలింగ్ ర్యాకింగ్స్ లో నంబర్ వన్ గా నిలవడం ఇది రెండోసారి.

ఈ సంవత్సరం జనవరిలో అతను అగ్రస్థానంలో నిలిచాడు. అయితే రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజల్ వుడ్ సిరాజ్ దాటి మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఇప్పుడు సిరాజ్ మళ్లీ హాజల్ వుడ్ ను అధికమించి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. శ్రీలంకపై కాకుండా పాకిస్థాన్ పై కూడా మహ్మద్ సిరాజ్ మంచి ప్రదర్శనే చేశాడు. బౌలింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా మహ్మద్ సిరాజ్ ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగంగా ఓ పోస్టు చేశాడు. కొన్ని రోజుల కింద తనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టాడు.

Bowler Mohammed Siraj made an emotional post about his father
'మిస్‌ యు పాపా' అంటూ క్యాప్షన్‌ పెట్టి.. తనను తల్లిదండ్రులు ఆశీర్వదిస్తున్న ఫోటోను వారిద్దరు చూస్తున్న చిత్రానికి తాను గ్రౌండ్‌లో ఆడుతున్న ఫోటోను అతను జత చేసి పోస్ట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ పోస్ట్ పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహ్మద్ సిరాజ్ 2017 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఆర్సీబీకి ఆడాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ఆరంభంలో సిరాజ్ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. వికెట్లు రాకపోవడంతో అతను జట్టులో స్థానం కోల్పోయాడు.

ఆ తర్వాత దేశావాలీ, ఐపీఎల్ లో రాణించి జాతీయ జట్టు మళ్లీ స్థానం సంపాదించాడు. 2020-21 బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన చేశాడు. తండ్రి మరణించినా స్వదేశానికి రాకుండా ఆడాడు. ఇదే విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. సిరాజ్ కష్టపడి ఈ స్థాయికి చేరడాని కామెంట్ చేస్తున్నారు. నిజానికి సిరాజ్ క్రికెటర్ గా ఎదగడానికి చాలా కష్టపడ్డాడు. తనకు షూస్ లేక చెప్పులతోనే బౌలింగ్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+