కన్నతల్లినే కరవబోయిన పిచ్చికుక్క బాధిత బాలుడు
చెన్నై: పిచ్చికుక్క కరవడంతో కుక్కలాగే మెరుగుతున్న తన కుమారుడి పరిస్ధితిని చూసి ఓ తల్లి తల్లడిల్లిపోతుంది. తమిళనాడులోని అందియూరు సమీపాన గల బర్గూరు గిరిజన గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడికి ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆరు నెలల కిందట పిచ్చికుక్క కరిచింది.
ప్రాథమిక చికిత్స కోసం వెంటనే బర్గూరు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలుడిని ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రిలో రేబిస్ నిరోధక టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల వైద్యులు టీకాలు వేయకుండా నిర్లక్ష్యం చేశారు.

కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆకలితో ఉన్న తన కొడుక్కి అన్నం పెడదామని అనుకున్న తల్లి బాలుడుని భోజనానికి రమ్మంది. ఆమె పిలవగానే కుమారుడు కుక్కలా అరుస్తూ, ఆమెను కరిచేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా బిత్తరపోయిన తల్లి కుమారుడిని గదిలో బంధించింది.
విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన టీచర్లు అంబులెన్స్ రప్పించి చికిత్స కోసం బాలుడిని కోయంబత్తూరు జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో కుక్క కరిచినప్పుడు రేబిస్ నిరోధక టీకాలు వేయకపోవడమే పిల్లాడు కుక్కలా మెరగడానికి కారణమని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications