Electric Two-Wheeler: పేలిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం.. బాలుడు మృతి..

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనాలంటే జనాలు జంకుతున్నారు. నిత్యం ఏదో చోట ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోతున్నాయి. కొన్న చోట్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలిపోవడంతో బాలుడు మృతి చెందాడు. మహారాష్ట్రలోని వసాయ్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

ఉదయం 5 గంటలకు

ఉదయం 5 గంటలకు

తూర్పు వసాయ్‌లోని రాందాస్‌ నగర్‌కు చెందిన షానవాజ్‌ అన్సారీ సెప్టెంబరు 23వ తేదీ రాత్రి తన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టాడు. అనంతరం ఇంట్లో అందరూ పడుకున్నారు. ఉదయం 5 గంటల సమయంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో బైక్ పక్కనే ఉన్న షానవాజ్‌ అన్సారీ కుమారుడు షబ్బీర్‌, తల్లి రుక్సాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. షబ్బీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సెప్టెంబర్ 27న

సెప్టెంబర్ 27న


కొద్ది రోజుల క్రితం నపర్తి జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం పేలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడేలేదు. వనపర్తి జిల్లా కేంద్రంలోని వనపర్తి న్యూటౌన్‌ కాలనీలోని ఓ ఇంట్లో ఖాసీం, విష్ణు, రాములు రెంట్ కు ఉంటున్నారు. సెప్టెంబర్ 27న రాత్రి విష్ణు స్నేహితుడు కిశోర్‌ వీరు రెంట్ కు ఉంటున్న ఇంటి ఆవరణలో తన ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఛార్జింగ్‌ చేశారు. ఛార్జింగ్ పూర్తయిన తర్వాత కిశోర్ పైకి వెళ్లి పడుకున్నాడు.

విద్యుత్తు మీటర్లు, తలుపులు

విద్యుత్తు మీటర్లు, తలుపులు


అర్ధరాత్రి ఛార్జింగ్‌ చేసిన విద్యుత్తు వాహనం (ఈవీ) బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి.ఆ మంటలు పక్కనే ఉన్న మరో రెండు ద్విచక్ర వాహనాలు, ఒక సైకిల్‌ అంటుకుని అవి దగ్ధమయ్యాయి. దగ్గరలోనే ఉన్న విద్యుత్తు మీటర్లు, తలుపులు కూడా కొంత కాలిపోయాయి. ఇంటి పై అంతస్థులో నిద్రిస్తున్నవారు భయాందోళనకు గురయ్యారు. మెట్ల ద్వారా కిందికి దిగలేక తాళ్ల సాయంతో కిందికి దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+