బాలుడ్ని చంపి 35 రోజులు శవాన్ని సూట్‌కేసులో పెట్టాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. డబ్బుల కోసం ఇంటి యజమాని కుమారుడిని కిడ్నాప్ చేసి, పోలీసుల భయంతో అతన్ని చంపి సూట్‌కేసులో శవాన్ని పెట్టాడు.

సూట్‌కేసులో బాలుడి శవాన్ని పెట్టిన 35 రోజులకు ఘటన వెలుగు చూసింది. ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతానికి చెందిన అవదేశ్ సఖ్య అనే 27 ఏళ్ల యువకుడిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.

సివిల్స్‌కు తయారవుతూ ఇలా...

సివిల్స్‌కు తయారవుతూ ఇలా...

అవదేశ్ సివిల్స్ పరీక్షలు రాసేందుకు కోచింగ్ తీసుకుంటున్నాడు. డబ్బు కోసం తాను ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు ఆశిష్‌ (7)ను కిడ్నాప్ చేశాడు. సైకిలు కొనిస్తానని ఆశపెట్టి తీసుకుని వెళ్లి కిడ్నాప్ చేశాడు. యజమాని నుంచి డబ్బు లాగాలని చూశాడు.

పట్టుకుంటారనే భయంతో

పట్టుకుంటారనే భయంతో

పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఆశిష్‌ను అవదేశ్ చంపేసి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కాడు. దాన్ని పరుపు కింద పెట్టుకుని 35 రోజులు గడిపాడు. తన గదిలోంచి దుర్వాసన వస్తుండడంతో ఎలుకు చనిపోయిందని చెబుతూ వచ్చాడు. సెంటు కొట్టి దుర్వాసన రాకుండా జాగ్రత్త పడ్డాడు కూడా.

పోలీసులకు తండ్రి ఫిర్యాదు..

పోలీసులకు తండ్రి ఫిర్యాదు..

జనవరి 6వ తేదీన తన కుమారుడు కనిపించడం లేదని ఆశిష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అతన్ని అవదేష్ హత్య చేసిన విషయం తెలియలేదు. హత్య జరిగిన తర్వాత కూడా అవదేశ్ వారి ఇంటికి వస్తూ సానుభూతి ప్రకటిస్తూ వచ్చాడు.

అనుమానంతో తనిఖీలు

అనుమానంతో తనిఖీలు


ఆ ప్రాంతంలో పోలీసు గస్తీ ఎక్కువగా ఉండడంతో శవాన్ని అవదేశ్ బయటకు తరలించలేకపోయాడు. అనుమానంతో పోలీసులు అవదేశ్ గదిని తనిఖీ చేశారు. సూట్‌కేసులో బాలుడి శవం తనిఖీల్లో బయటపడింది. దీంతో పోలీసులు అవదేశ్‌ను అరెస్టు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Delhi Police arrested a 27-year-old man on Tuesday for allegedly killing a seven-year-old boy in January.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి