తండ్రి హంతకున్ని చంపి 12 ముక్కలు కోశాడు

మొరాదాబాద్: తన తండ్రిని హత్య చేసిన వ్యక్తిపై పగ తీర్చుకోవడానికి ఓ బాలుడు 12 ఏళ్లు నిరీక్షించాడు. 12 ఏళ్ల తర్వాత అతను తన తండ్రి హంతకున్ని చంపేసి, మృతదేహాన్ని 12 ముక్కలుగా నరికాడు. అతని వయస్సు 12 ఏళ్లు ఉన్నప్పుడు అతని తండ్రి హత్యకు గురయ్యాడు. తనకు 24 వయస్సు వచ్చిన తర్వాత తండ్రి హంతకుడిని చంపేసి పగ తీర్చుకున్నాడు.

తాను హత్య చేసినందుకు అతను ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. పోలీసులకు దొరికిన తర్వతా తానే నేరం చేశానని మీడియా ప్రతినిధుల వద్ద నవ్వుతూ చెప్పాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. తన తండ్రిని అతని స్నేహితుడు మహ్మద్ రైజ్ హత్య చేశాడు. ఆ సమయంలో ఆలమ్ ఖాన్ వయస్సు 12 ఏళ్లు.

Boy waits 12 years to avenge dad’s murder, cuts accused into 12 parts

ఆ తర్వాత 12 ఏళ్లకు ఆలం ఖాన్ అదును కోసం చూసి తన మిత్రుడితో కలిసి రైజ్‌ను చంపేశాడు. తన 12 ఏళ్ల నిరీక్షణకు గుర్తుగా అతని మృతదేహాన్ని 12 ముక్కలు చేశాడు. వాటిని మూట గట్టి గంగానదీ తీరంలో పడేశాడు. పోలీసులకు మృతదేహం తల కనిపించలేదు. దీంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టమైంది.

ఛాతీ మీద కుట్ల ఆధారంగా హతుడు తన సోదరుడేనని ఓ వ్యక్తి చెప్పడంతో పోలీసులు దర్యాప్తు జరిపి ఆలమ్ ఖాన్‌ను, అతనికి సహకరించిన మిత్రుడు షోయబ్ కలామ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన చాకు, రంపం, సుత్తిలను నిందితుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+