టెర్రరిస్టులు ఇల్లు తగులబెట్టారు: అతనే టాప్
శ్రీనగర్: అంజుమ్ బషీర్ ఖాన్ అనే 27 ఏళ్ల యువకుడి ఇంటిని 18 ఏళ్ల క్రితం ఉగ్రవాదులు తగులబెట్టారు. జమ్మూ కాశ్మీర్‌లోని మారమూల గ్రామంలో ఆయన కుటుంబం నివాసం ఉండేది. ఇప్పుడు అతను కాశ్మీర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ టాపర్‌గా నిలిచాడు.
శ్రీనగర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే సురాన్‌కోట్ గ్రామంలోని అంజుమ్ బషీర్ ఖాన్ కుటుంబం ఇంటిని తగులబెట్టి, ఆ కుటుంబాన్ని ఆ గ్రామం నుంచి తరిమేశారు. దాంతో ఆ కటుుంబం జమ్ములోని ఓ గ్రామానికి తరలి వచ్చింది.

సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణుడైన తర్వాత ఖాన్ తన స్వగ్రామం సురాన్‌కోటకు వెళ్లాలని అనుకుంటున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లోని సురాన్ కోట 1990 దశకంలో ఉగ్రవాదుల అడ్డాగా ఉండేది. తమ పిల్లలను వారిలో చేర్పించాలని ఉగ్రవాదులు తమపై తీవ్రమైన ఒత్తిడి పెట్టారని ఖాన్ తండ్రి మొహమ్మద్ బషీర్ ఖాన్ అన్నాడు.
తన పిల్లలకు అత్యుత్తమ విద్యను అందుబాటులోకి తేవడానికి తాను తీవ్రంగా కృషి చేసినట్లు, తద్వారా ఈ ప్రాంతంలో శాంతికి, అభివృద్ధికి వారు అంబాసిడర్లుగా ఉండాలని తాను భావించినట్లు తెలిపారు.
రాష్ట్ర సివిల్ సర్వీసెస్ పరీక్షకు 2015లో 12 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా 51 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఏళ్ల తరబడిగా పెట్టిన శ్రమ అంజుమ్ బషీర్ ఖాన్ విషయంలో ఫలితాన్ని ఇచ్చింది. కుటుంబ త్యాగం కూడా అందులో ఉంది.












Click it and Unblock the Notifications