Wife: భర్త మాజీ సైనికుడు, వరుసకు తమ్ముడు ప్రియుడు, మద్యలో పొలిటికల్ లీడర్ ? !
చెన్పై/ తిరువణ్ణామలై: భారత సైన్యంలో ఉద్యోగం చేస్తున్న యువకుడికి చాలా సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి అతని భార్య పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని సొంత ఊరుకు వచ్చాడు. అయితే అప్పటికే మాజీ సైనికుడి భార్య వరుసకు తమ్ముడు అయ్యే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని మస్త్ మజా చేస్తూ అతని మోజులో పడిపోయింది. మాజీ సైనికుడికి చాలాకాలం పాటు భార్య మ్యాటర్ తెలీలేదు. ఇటీవల ప్రమాదంలో మాజీ సైనికుడు చనిపోయాడు. మాజీ సైనికుడి కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మాజీ సైనికుడి భార్య, ఆమె ప్రియుడు అరెస్టు అయ్యారు. మాజీ సైనికుడి హత్య కేసులో ఓ రాజకీయ నాయకుడు కోర్టులో లొంగిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

సైనికుడితో రేవతి పెళ్లి
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని అరణి సమీపంలోని మొలుగంబుడి గ్రామంలో నివాసం ఉంటున్న వెట్రివేల్ అనే వ్యక్తి భారత సైన్యంలో చేరాడు. తిరువణ్ణామలై జిల్లాలోని బన్నుపురం గ్రామంలో నివాసం ఉంటున్న రేవతి అనే మహిళతో 18 సంవత్సరాల క్రితం వెట్రివేల్ వివాహం అయ్యింది.

ముగ్గురు పిల్లలు
18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న వెట్రివేల్, రేవతి దంపతులకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. సైన్యంలో ఉద్యోగం చేస్తున్న వెట్రివేల్ కొన్ని సంవత్సరాల పాటు సెలవుల్లో ఇంటికి వెళ్లి అతని భార్య రేవతి, ముగ్గురు పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులతో చాలా సంతోషంగా జీవించాడు.

వరుసకు తమ్ముడు..... అక్రమ సంబందం
వెట్రివేల్ కు ఓ చెల్లెలు ఉంది. వెట్రివేల్ చెల్లెలికి కుమకూర్ గ్రామానికి చెందిన నాగరాజ్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. భర్త చెల్లెలి భర్త (వరుసకు తమ్ముడు) అయ్యే నాగరాజ్ ఇంటికి వచ్చి వెలుతున్న సమయంలో అతనితో రేవతి చనువు పెంచుకుంది. వరుసకు తమ్ముడు అయ్యే నాగరాజ్ తో అక్రమ సంబంధం పెట్టుకుని మస్త్ మజా చేస్తున్న రేవతి అతని మోజులో పడిపోయింది.

ఎవ్వరికీ డౌట్ రాలేదు
వరుసకు అన్నా, చెల్లెలు అయ్యే వెట్రివేల్ భార్య రేవతి, నాగరాజ్ క్లోజ్ గా ఉండటంతో ఎవ్వరికి అనుమానం రాలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసిన వెట్రివేల్ అతని భార్య రేవతి, ముగ్గురు పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని తిరువణ్ణామలై జిల్లాలోని అతని సొంత ఊరుకు రెండు సంవత్సవరాల క్రితం వచ్చాడు.

భార్య మ్యాటర్ లీక్
మాజీ సైనికుడు వెట్రివెల్ కు చాలాకాలం పాటు అతని భార్య రేవతి అక్రమ సంబంధం మ్యాటర్ తెలీలేదు. సంవత్సరం క్రితం రేవతి అక్రమ సంబంధం విషయం ఆమె భర్త, మాజీ సైనికుడు వెట్రివేల్ కు తెలిసిపోయింది. అప్పటి నుంచి వెట్రివేల్, రేవతిల మద్య గొడవలు జరుగుతున్నాయి.

భర్త హత్యకు బీజేపీ లీడర్ తో రూ. 10 లక్ష్లలకు డీల్
రేవతి, వెట్రివేల్ దంపతుల మద్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తన భర్త బతికుంటే కష్టం అని అనుకున్న రేవతి ఆమె ప్రియుడి సహాయంతో బీజేపీ నాయకుడు, పాతనేరస్తుడు రాజేష్ ను కలిసి వెట్రివేల్ హత్యకు రూ. 10 లక్షలు డీల్ మాట్లాడుకున్నారు. బైక్ లో వెలుతున్న వెట్రివేల్ ను వేరే వాహనంతో ఢీకొట్టిన రాజేష్ అతను ప్రమాదానికి గురైనట్లు చిత్రీకరించారు. తరువాత రేవతి ఆమె భర్త వెట్రివేల్ ను వేలూరు ఆసుపత్రిలో చేర్పించింది.

పక్కాప్లాన్ తో భర్తను చంపేసింది
వేలూరు ఆసుపత్రిలో కొన్ని రోజులు భర్త వెట్రివేల్ కు చికిత్స చేయించిన రేవతి తరువాత అతన్ని ఇంటికి పిలుచుకుని వెళ్లింది. రెండు రోజుల తరువాత ప్రియుడు నాగరాజ్, బీజేపీ లీడర్ రాజేష్ ను ఇంటికి పిలిపించిన రేవతి ఆమె భర్త వెట్రివేల్ ను చంపేసింది. రేవతి ఆమె భర్త కాళ్లు గట్టిగా పట్టుకుంటే ప్రియుడు నాగరాజ్ చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఆ సందర్బంలో బీజేపీ లీడర్ రాజేష్ మాజీ సైనికుడు వెట్రివేల్ గొంతు కోసి చంపేశారు.

మాజీ సైనికుడి హత్య కేసులో ఆల్ ఔట్
మాజీ సైనికుడు వెట్రివేల్ కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మాజీ సైనికుడు వెట్రివేల్ భార్య రేవతిని, ఆమె ప్రియుడు నాగరాజ్ ను విచారణ చేసి అసలు మ్యాటర్ తెలుసుకుని అరెస్టు చేశా. మాజీ సైనికుడు వెట్రివేల్ హత్య కేసులో బీజేపీ నాయకుడు రాజేష్ కూడా వేలూరు కోర్టులో లొంగిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. మొత్తం మీద ప్రియుడి మోజులో రేవతి ఆమె భర్త వెట్రివేల్ ను హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.