Breaking: మధుర మసీదులో సర్వే ఆపండి- సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..!
శ్రీకృష్ణ జన్మస్ధలంగా భావిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ లోని మధురలో ఉన్న షాహీ ఈద్గా మసీదులో సర్వేకు అనుకూలంగా గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సుప్రీంకోర్టు ఇవాళ బ్రేక్ వేసింది. మసీదులో సర్వే నిర్వహిస్తే గతంలో గుడిపై దీన్ని నిర్మించిన విషయం తేలుతుందంటూ హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అలాహాబాద్ హైకోర్టు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. అయితే దీన్ని ఇవాళ సుప్రీంకోర్టు నిలిపేసింది.
17వ శతాబ్దం నాటి షాహీ ఈద్గా మసీదులో సర్వే నిర్వహణ కోసం అడ్వకేట్ కమిషనర్ ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జ్ఞానవాపి మసీదులో సర్వేకు అనుమతి ఇచ్చినట్లే ఈసారి షాహీ ఈద్గా మసీదులోనూ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సర్వేను తాత్కాలికంగా నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

చరిత్రలో శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మసీదు నిర్మించారని హిందూ సంఘాలు సర్వే చేయాలని పట్టుబట్టాయి. గతంలో ఉన్న కాట్రా కేశవ్ దేవ్ ఆలయాన్ని కూల్చివేసి శతాబ్దాల నాటి మసీదును నిర్మించారని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశాయి.
వివాదాస్పద 13.37 ఎకరాల భూమిపై పూర్తి యాజమాన్యం కావాలని హిందూ పక్షం మధుర కోర్టును కోరింది. ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు గుడిని కూల్చేసి మసీదు నిర్మించారని వారు పిటిషన్లో ఆరోపించారు. ఈ డిమాండ్‌ను గత ఏడాది డిసెంబర్‌లో మధుర స్థానిక కోర్టు అంగీకరించింది. అయితే ముస్లిం సంఘాలు దీన్ని హైకోర్టులో సవాల్ చేశాయి.












Click it and Unblock the Notifications