వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే మనల్ని కాపాడుతుంది: బ్రెగ్జిట్‌పై రాజన్, ఎలాంటిదైనా సిద్ధం: జైట్లీ

|
Google Oneindia TeluguNews

ముంబై: బ్రెగ్జిట్ పైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ శుక్రవారం నాడు వేర్వేరుగా స్పందించారు. జైట్లీ మాట్లాడుతూ.. అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. భారత దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

బ్రెగ్జిట్ ఎఫెక్ట్, రాజకీయాల్లో కుదుపు: కామెరూన్ రాజీనామా!బ్రెగ్జిట్ ఎఫెక్ట్, రాజకీయాల్లో కుదుపు: కామెరూన్ రాజీనామా!

Brexit: RBI's Raghuram Rajan promises liquidity support to absorb shocks

ప్రభుత్వం, ఆర్పీఐ అన్నింటికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రపంచ స్టాక్ మార్కెట్‌లను, కరెన్సీలను నిశితంగా పరిశీలిస్తున్నామని రాజన్ చెప్పారు. అవసరమైతే ద్రవ్యలోటును పూడ్చేందుకు చర్యలు చేపడతామన్నారు.

ఈయూ నుంచి బ్రిటన్ ఔట్: విడిపోదామన్న మెజార్టీ ప్రజలు, ట్రేడింగ్ నిలిపివేసిన జపాన్ ఈయూ నుంచి బ్రిటన్ ఔట్: విడిపోదామన్న మెజార్టీ ప్రజలు, ట్రేడింగ్ నిలిపివేసిన జపాన్

మనం ఈ షాక్ నుంచి తేరుకుంటామనే ఆశాభావానని వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాల కరెన్సీ కంటే మన భారత దేశ కరెన్సీకి స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని రాజన్ చెప్పారు. మనం సరైన విధానంలో వెళ్తే బ్రెగ్జిట్ ప్రభావం తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భారత దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని, బ్రెగ్జిట్ ప్రభావం నుంచి అది మనలను రక్షిస్తుందన్నారు.

English summary
Reserve Bank of India Governor said that RBI would provide liquidity to allow orderly adjustment in the local market following Britain's exit (Brexit) from European Union creating ripples across global markets, while he expects India's strong fundamentals would help it to remain largely immune from the shock.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X