బ్రెగ్జిట్ ఎఫెక్ట్: భారత్ ఐటీ కంపెనీలపై దెబ్బ, ఎలా?

న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ ప్రభావం భారత్, భారత్ ఐటీ కంపెనీల పైన కూడా పడనుంది. భారత్ నుంచి యూఈకి (యూరోపియన్ యూనియన్) 150 మిలియన్ డాలర్ల సాఫ్టువేర్ ఎగుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరెన్సీ పైన ప్రభావం పడనుంది.

ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కాం బ్రెగ్టి పైన స్పందిస్తూ.. లాభనష్టాలను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తక్షణ ప్రభావం తోసిపుచ్చలేమని చెబుతున్నారు. కరెన్సీ తదితర వాటి పైన వెంటనే ప్రభావం పడుతుందన్నారు.

ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోతే.. భారత ఐటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని తొలి నుంచి చెబుతున్నారు.

bres

భారత్‌కు చెందిన టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ తదితర దిగ్గజ ఐటీ కంపెనీలు బ్రిటన్‌ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

బ్రెగ్జిట్‌ వల్ల 2016-17లో బ్రిటన్‌లోని ఈ కంపెనీల కార్యకలాపాల ఆదాయ వృద్ధి 10-14 శాతం తగ్గొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్లించ్‌ తొలుతే అంచనా వేసింది.

బ్రిటన్‌, ఐరోపా ప్రాంతాల వృద్ధిలో మందగమనం, పౌండు క్షీణించే అవకాశం ఉండటం ఇందుకు కారణాలుగా పేర్కొంటోంది. అలాగే ఒక్కో షేరుపై ఆర్జించే ఆదాయం (ఎర్నింగ్‌ ఫర్‌ షేర్‌- ఈపీఎస్‌) పైనా 3-8 శాతం వరకు ప్రభావం పడుతుందని అభిప్రాయపడుతోంది.

బ్రెగ్జిట్ ఐటీ రంగాన్ని తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. డాలర్‌కు వ్యతిరేకంగా బ్రిటన్ పౌండ్ విలువ భారీగా పతనం కావడంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజిలో ఐటీ ఇండెక్స్ 4 శాతానికి పైగా నష్టపోయింది. ఈ ప్రభావం స్వల్పమేనని ఐటీ నిపుణులు అంటున్నారు.

టెక్ మహీంద్రా దాదాపు ఏడు శాతం, హెచ్‌సీఎల్ టెక్ ఎక్కవ 6 శాతం క్షీణించగా, టీసీఎస్, విప్రో 3 నుంచి ఆరు శాతం మేర పతనమయ్యాయి. అలాగే యూకే నుంచి టీసీఎస్ 13 సాతం హెచ్‌సీఎల్ టెక్ 14 శాతం భారీ ఆదాయాన్ని పొందుతుండగా, ఇన్ఫోసిస్, విప్రోలు కూడా దాదాపు 7 నుంచి 11 శాతం ఆదాయాన్ని పౌండ్లలో పొందుతున్నాయని చెబుతున్నారు. పౌండ్ విలవ 31 సంవత్సరాల కనిష్టానికి కూలిపోయింది.

బ్రిటన్ యూరోపియన్ వైదొలుగుతున్న ప్రభావం ఐటీ పరిశ్రమ పైన స్వల్ప కాలికమేనని పరిశ్రమ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఈ అనిశ్చిత వాతావరణంలో భారీ హెచ్చుతగ్గులు, ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. బ్రెగ్జిట్ ప్రభావంతో మారకపు అనిశ్చితి కారణంగా ప్రతికూల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని నాస్కాం అధ్యక్షులు ఆర్ చంద్రశేఖర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+