బరువు తగ్గిస్తారని వెలితే చంపేశారు: యువతి శవం ఇవ్వడానికి లంచం డిమాండ్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

కోయంబత్తూరు: బరువు తగ్గడానికి చికిత్స కోసం వెళ్లిన యువతి మరణించింది. వైద్యుల నిర్లక్షానికి బలి అయిన యువతి మృతదేహాన్ని అప్పగించడానికి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది లంచం డిమాండ్ చేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది.

భాగ్యశ్రీ (17) అనే యువతి బరువు తగ్గడానికి సేలంలోని ఓ ప్రైవేట్ హెర్బల్ క్లీనిక్ లో చేరింది. అయితే ప్రైవేట్ హెర్బల్ క్లీనిక్ వైద్యులు నిర్లక్షంగా ఆమెకు చికిత్స చేశారు. చికిత్స విఫలమై భాగ్యశ్రీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వెంటనే ఆ ప్రైవేట్ హెర్బల్ క్లీనిక్ నిర్వహకులు భాగ్యశ్రీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టుం కోసం ఆమె శవాన్ని కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Bribe to get dead out of mortuary in Coimbatore

విషయం తెలుసుకున్న భాగశ్రీ కుటుంబ సభ్యులు కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి చేరుకున్నారు. పోస్టుమార్టుం గదిలో ఉన్న భాగ్యశ్రీ శవాన్ని చూసి కుప్పకూలిపోయారు. శవాన్ని అప్పగించాలంటే రూ. 3 వేలు లంచం ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేశారు.

అసలే అమ్మాయి ప్రాణాలు పోవడంతో భాగ్యశ్రీ కుటుంబ సభ్యులు మండిపడ్డారు. పోస్టుమార్టుం గదిలో ఉన్న భాగ్యశ్రీ మృతదేహాన్ని బలవంతంగా బయటకు తీసుకువచ్చి ఆంబులెన్స్ లో 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంత ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. శవం ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని భాగ్యశ్రీ కుటుంబ సభ్యులతో పాటు పలు స్వచ్చంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This is what happened unfortunately in the case of a dead 17-year-old girl, Bagyashree, whose family was forced to carry her out of the mortuary of a hospital to the ambulance because they refused to a pay a bribe of Rs.3000 demanded by hospital workers.
Please Wait while comments are loading...