మిత్రుడితో వధువు పరారీ: ఆమె సోదరితో వరుడి పెళ్లి
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. వధువు పెళ్లికి ముందు మిత్రుడితో పారిపోగా, వరుడు ఆమె సోదరిని వివాహం చేసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటనపై సాక్షి తెలుగు మీడియాలో వార్తాకథనం వచ్చింది. తమిళనాడులోని తిరువట్టారుకు చెందిన యువకుడు ఒకరితో నాగర్‌కోయిల్ సమీపన ఉన్న ఎరచ్చి కులం ప్రాంతానికి చెందిన యువతికి తల్లిదండ్రులు వివాహ నిశ్చితార్థం చేశారు. వారి వివాహం ఎరచ్చి కులంలో సోమవారం జరగాల్సి ఉంది.
పెళ్లికూతురు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ వివాహానికి రెండు రోజుల క్రితం ఆమె స్వగ్రామానికి వచ్చింది. ఆమెతో పాటు ఓ యువకుడు వచ్చాడు. తన స్నేహితుడిగా కుటుంబసభ్యులకు పరిచయం చేసింది. వధువు ఇంట్లో అతను అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. ఏర్పాట్లలో సేవలందించాడు.
ఆదివారం సాయంత్రం వరుడు బంధువులు వధువు ఇంటికి వచ్చారు.

అప్పుడు ఆ స్నేహితుడ్ని చూసి నోరు వెళ్లబెట్టారు. అర్థరాత్రి సమయంలో వధువు తండ్రి కల్యాణ మండపం నుంచి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో వధువు, ఆ స్నేహితుడు కానరాలేదు. ఆ ఇద్దరూ ఓ మోటార్‌సైకిల్‌పై వెళ్లినట్టు ఆ ఇరుగుపొరుగువారు చెప్పడంతో ఆందోళన చెందారు.
తిరువట్టారులోని వరుడుకి సమాచారం అందించారు. అయితే, పెళ్లి నిలపవద్దని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించాడు. వధువు సోదరితో అతని వివాహం జరిగింది. స్నేహితుడితో వధువు పరారు కావడం ఆ పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications