వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్ భవన్ కింద అద్బుతమైన బంకర్ (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

ముంబై: బ్రిటీష్ కాలం నాటి బంకర్ ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు వెలికి తీశారు. దాదాపు 150 మీటర్ల పొడవైన బంకర్ ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ భవన్ పరిసరాల్లోనే ఈ పురాతన బంకర్ ఉంది.

రాజ్ భవన్ పరిసరాల్లో ఓ బంకర్ ఉందని కొందరు పూర్వీకులు విద్యాసాగర్ రావుకు సమాచారం ఇచ్చారు. ఆయన నివాసం ఉంటున్న మల్బార్ హిల్స్ లోని రాజ్ భవన్ కింద ఈ బంకర్ ఉందని గుర్తించారు. సాదరణంగా ఉండే బంకర్ కంటే ఇది భిన్నంగా ఉంది.

రాజ్ భవన్ కింద అద్బుతమైన బంకర్ (ఫోటోలు)

రాజ్ భవన్ కింద అద్బుతమైన బంకర్ (ఫోటోలు)

150 మీటర్లకు పైగా పొడవున్న ఈ బంకర్ లో చిన్నచిన్న గదులు ఉన్నాయి. బంకర్ కు రెండు వైపుల 20 అడుగుల ఎత్తు ఉన్న తలుపులు ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా లోపలికి వెలుతురు, స్వచ్చమైన గాలి వచ్చేలా, మురుగనీటి పారుదల వ్యవస్థకు ఏర్పాట్లు చేశారు.

రాజ్ భవన్ కింద అద్బుతమైన బంకర్ (ఫోటోలు)

రాజ్ భవన్ కింద అద్బుతమైన బంకర్ (ఫోటోలు)


ఈ బంకర్ కు తూర్పు వైపు ఉన్న ద్వారం మూసివేశారు. పశ్చిమ వైపు ఉన్న ద్వారం తెరిచారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ బంకర్ ను మూసివేశారని, అయినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

రాజ్ భవన్ కింద అద్బుతమైన బంకర్ (ఫోటోలు)

రాజ్ భవన్ కింద అద్బుతమైన బంకర్ (ఫోటోలు)


మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అధికారులు ఈ బంకర్ ను సందర్శించారు. పురావస్తు శాఖ అధికారులకు చెప్పి దాని సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.

 రాజ్ భవన్ కింద అద్బుతమైన బంకర్ (ఫోటోలు)

రాజ్ భవన్ కింద అద్బుతమైన బంకర్ (ఫోటోలు)


ఈ బంకర్ లో మొత్తం 13 గదులు ఉన్నాయి. అందులో గన్ షెల్, షెల్ స్టోర్, షెల్ లిఫ్ట్, కాట్రిజ్ స్టోర్, వర్క్ షాప్, పంప్ వంటి ప్రత్యేక గదులు ఉన్నాయి. ఈ బంకర్ ను చక్కగా సంరక్షిస్తే మహారాష్ట్ర పర్యటక శాఖ కచ్చితంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు అంటున్నారు.

 రాజ్ భవన్ కింద అద్బుతమైన బంకర్ (ఫోటోలు)

రాజ్ భవన్ కింద అద్బుతమైన బంకర్ (ఫోటోలు)


బ్రిటీష్ లు భారతదేశాన్ని పాలించే సమయంలో ఈ అద్బుతమైన బంకర్ నిర్మించారని వెలుగు చూసింది. తరువాత ఈ బంకర్ మూసివేశారు. దశాభ్దాలు గడిచినా ఈ బంకర్ చెక్కుచెదరలేదు. చూడటానికి చాల ఆకర్షనీయంగా, అద్బుతంగా ఉందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు.

English summary
The staff of the Public Works Department at Raj Bhavan broke open a temporary wall that closed the entrance to the bunker on the eastern side.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X