వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన రోడ్డు.. మన భారత్‌లో..

వాహనాలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డు మార్గాన్ని జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలో నిర్మించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: వాహనాలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డు మార్గాన్ని జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలో నిర్మించారు. 'ప్రాజెక్ట్‌ హిమాంక్‌'లో భాగంగా భూ ఉపరితలానికి 19,300 అడుగుల ఎత్తులో ఈ రోడ్డు నిర్మాణాన్ని బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో) చేపట్టింది.

లేహ్‌కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిసుమ్లే, దెమ్‌చోక్‌ గ్రామాలను కలుపుతూ 86కిలోమీటర్ల పొడవులో ఈ రోడ్డును నిర్మించినట్లు బీఆర్‌వో ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఇంత ఎత్తులో రోడ్డును నిర్మించడం అంటే అది చాలా కష్టతరం, ప్రమాదకరమని ప్రాజెక్ట్‌ హిమాంక్‌ చీఫ్‌ ఇంజినీర్‌ బ్రిగేడర్‌ డీఎం పూర్విమత్‌ అన్నారు.

BRO builds world's highest motorable road in Ladakh

ఇక్కడ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో నిర్మాణ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. 'వేసవిలోనే ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్‌ 10 నుంచి మైనస్‌ 20 డిగ్రీల మధ్య ఉంటాయి. ఇక చలికాలంలో అయితే మైనస్‌ 40 డిగ్రీల వరకు పడిపోతుంది. సాధారణ ఎత్తులో పోలిస్తే ఇక్కడ ఆక్సిజన్‌ స్థాయి కూడా 50శాతం తక్కువగా ఉంటుంది. దీంతో సిబ్బంది, మెషిన్ల సామర్థ్యం సగానికి తగ్గుతుంది. అంతేగాక.. మెషిన్‌ ఆపరేటర్లు ఆక్సిజన్‌ కోసం ప్రతి పది నిమిషాలకోసారి కిందకు వెళ్లాల్సి ఉంటుంది' అని పూర్విమత్‌ అన్నారు.

ఇక దీని వల్ల ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యాయని చెప్పారు. అయినప్పటికీ.. దేశ ప్రయోజనాల కోసం తమ సిబ్బంది రాత్రింబవళ్లూ కష్టపడి ఈ లక్ష్యాన్ని పూర్తిచేసినట్లు చెప్పారు. ప్రాజెక్ట్‌ హిమాంక్‌లో భాగంగా గతంలో 17,900 అడుగుల ఎత్తులో, 17,695 అడుగుల ఎత్తులో రోడ్లను నిర్మించారు.

English summary
In a major feat, the Border Roads Organisation (BRO) has constructed the world's highest motorable road in Ladakh region of Jammu and Kashmir, passing through Umlingla Top at a height of over 19,300 feet.The feat was achieved under 'Project Himank' of the organisation. Being close to Hanle, the 86km long strategic road connects Chisumle and Demchok villages, located 230 km from Leh. These villages are stone's throw away from the India-China border in eastern sector, a spokesman of BRO said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X