సెక్స్‌కు నో చెప్పినందుకు మరదలు సజీవదహనం
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. రేప్‌కు సహకరించలేదనే నెపంతో మరదలిపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు ఓ దుర్మార్గుడు.
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. రేప్‌కు సహకరించలేదనే నెపంతో మరదలిపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు ఓ దుర్మార్గుడు.
యూపీలోని బదౌన్‌కు సమీప గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కోరిక తీర్చేందుకు నిరాకరించిందనే ఆగ్రహంతో మహిళను సొంత బావ సజీవ దహనం చేశాడు. లబరి గ్రామంలో బుధవారం రాత్రి వితంతు మహిళ నీలం ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె బావ అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు.

బాధితురాలు నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన నిందితుడు ఆమెను సజీవ దహనం చేశాడని పోలీసులు చెప్పారు. ఘటనా స్థలంలోనే ఆమె మరణించారు. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications