బెంగళూరులో దంపతుల దారుణ హత్య, చేతులు, కాళ్లు కట్టేసి, లూటీ, గ్యాస్ సిలిండర్ !
బెంగళూరులో దంపతుల దారుణ హత్య, దుర్వాసన కాళ్లు, చేతులు కట్టేసి, నోటిలో బట్టలు కుక్కి, కత్తులతో పోడిచి హత్యతెలిసిన వారే హత్యలు చేసి ఉంటారు, రూ. లక్షల విలువైన బంగారు నగలు లూటీ
బెంగళూరు: ఇంటిలో ఒంటరిగా ఉంటున్న వృద్ద దంపతులను అతిదారుణంగా హత్య చేసి లక్షల రూపాయల విలువైన బంగారు నగలు, నగదు లూటీ చేసిన ఘటన బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ ప్రాంతంలో జరిగింది. బీఇఎల్ రిటైడ్ ఉద్యోగి గోవిందన్, సరోజ దంపతులు హత్యకు గురైనారు. దంపతులను హత్య చేసి గ్యాస్ సిలిండర్ పేల్చేయాలని ప్రయత్నించిన దుండగులు చివరికి పారిపోయారు.
బీఇఎల్ లో ఉద్యోగం చేస్తున్న గోవిందన్ 7 నెలల క్రితం రిటైడ్ అయ్యారు. గోవిందన్, సరోజ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే కుమార్తె, కుమారుడితో కాకుండా గోవిందన్, సరోజ దంపతులు వేరుగా నివాసం ఉంటున్నారు.

ఇంటి సమీపంలో కుమార్తె !
గోవిందన్, సరోజ దంపతులు ఇంటి సమీపంలోనే వారి కుమార్తె నివాసం ఉంటున్నది. మంగళవారం రాత్రి పోద్దుపోయిన తరువాత గోవిందన్ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కాళ్లు, చేతులు కట్టేసి, కత్తులతో !
పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని పరిశీలించగా గోవిందన్, సరోజ దంపతులు హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. గోవిందన్, సరోజ దంపతుల నోటికి, కాళ్లు, చేతులు బట్టలతో కట్టేసి కత్తులతో పోడిచి దారుణంగా హత్య చేశారు.

సిటీ పోలీసు కమిషనర్ !
జంట హత్యల విషయం తెలుసుకున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సునీల్ కుమార్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గోవిందన్ కుమార్తె, కుమారుడు సంఘటనా స్థలానికి చేరుకుని విలపించారు.

ఓం శక్తి గుడికి వెలుతున్నాం !
గోవిందన్ కుమార్తె ప్రతి రోజు ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల యోగక్షేమాలు విచారించేవారని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఆదివారం గోవిందన్, సరోజ దంపతులు తమిళనాడులోని ఓం శక్తి ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తామని చెప్పడంతో ఆమె కుమార్తె రెండు రోజులుగా అటు వైపు వెళ్లలేదని తెలిసింది.

రూ. లక్షల విలువైన నగలు, నగదు !
గోవిందన్, సరోజ దంపతులను హత్య చేసిన నిందితులు ఇంటిలో లక్షల రూపాయల విలువైన నగలు, నగదు లూటీ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. 7 నెలల క్రితం రిటైడ్ అయిన గోవిందన్ దగ్గర లక్షల రూపాయల నగదు ఉంటుందని తెలుసుకున్న వారే జంట హత్యలు చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తెలిసిన వారే చంపేశారు !
మూడు రోజుల క్రితమే దంపతులు హత్యకు గురైనారని పోలీసులు అంటున్నారు. దంపతులను హత్య చేసిన దుండగులు తరువాత గ్యాస్ సిలిండర్ పైపు లాగేసి నిప్పంటించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గోవిందన్, సరోజ దంపతులకు పరిచయం ఉన్నవారే జంట హత్యలు చేసి ఉంటారని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications